YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అపదకాలం లో ఆపద్బాంధవుడిగా జలీల్ అహ్మద్ గ్రీన్ ఫౌండేషన్ ద్వారా విస్తృతంగా సేవలు

అపదకాలం లో ఆపద్బాంధవుడిగా జలీల్ అహ్మద్   గ్రీన్ ఫౌండేషన్ ద్వారా విస్తృతంగా సేవలు

నెల్లూరు జూలై 25 
అపదకాలంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు తమవంతు సాయం అందిస్తూ అందరి ఆదరాభిమానాలు పొందుతున్నారు . నెల్లూరు జిల్లా కోట పట్టణానికి చెందిన గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ జలీల్ అహ్మద్, ఇటీవల కాలంలో 4 నెలలు కరోనా లాక్ డౌన్ లో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆపద్బాంధవుడిగా , జలీల్ అహ్మద్ గ్రీన్ ఫౌండేషన్ ద్వారా సుమారు 10 లక్షల రూపాయల తో గూడూరు నియోజకవర్గ పరిధిలోని అన్నీ మండల గ్రామాలలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. అదేవిధంగా  రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేసి, తన దాతృత్వం చాటారు.ఈ నేపథ్యంలో   కోట మండలం,కోట గ్రామంలోని గాంధీ బొమ్మ  సెంటర్ వద్దనున్న జమియా మసీదు నందు  మజియా గా పనిచేస్తున్న షేక్ బాబ్జి   మృతి చెందారు.మృతుడు   బాబ్జి నీరుపేద కావడంతో, బాబ్జి కుటుంబ పరిస్థితులు తెలుసుకున్న కోట పట్టణానికి చెందిన గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ జలీల్ అహ్మద్ వెంటనే  స్పందించి బాబ్జి అంత్యక్రియలకు 11వేల రూపాయలు బాబ్జి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సాయం అందజేసి, మరోసారి తన దాతృవాన్ని చాటారు. గ్రిన్ ఫౌండేషన్ ద్వారా ఎప్పటికప్పుడు స్పందించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ,ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న జలీల్ అహ్మద్ సేవలకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. బాబ్జి కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేసే కార్యక్రమంలో  ఫౌండేషన్ సభ్యులు సంధాని బాషా, ఇలియాజ్, నాయబ్,నౌషాద్,షకీల్, షoషూద్దీన్ తదితరులు ఉన్నారు.

Related Posts