విశాఖపట్నం జూలై 25
విశాఖపట్నంకు చెందిన నలంద కిషోర్ హఠాన్మరణం పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘వైసిపి తప్పుడు కేసుల వేధింపులు తట్టుకోలేకే మనస్థాపంతో మృతి చెందడం బాధాకరం. ఈ ప్రభుత్వ దుశ్చర్యలను ఖండిస్తున్నాను. కిషోర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడనే వంకతో నలంద కిషోర్ పై అక్రమ కేసులు బనాయించి, వృద్దాప్యంలో ఆయనను అరెస్ట్ చేసి, ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో విశాఖ నుంచి రోడ్డుమార్గంలో అనేక జిల్లాలు దాటించి కర్నూలు తరలించడం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం నానారకాలుగా శారీరక,మానసిక హింస పెట్టారు. ఈ క్షోభ తట్టుకోలేకే తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. నలంద కిషోర్ మరణానికి వైసిపి ప్రభుత్వమే బాధ్యత వహించాలని’’ చంద్రబాబు డిమాండ్ చేశారు.