తెనాలి జూలై 25
గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో నర్సింగ్ స్టాఫ్ ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు కూడా లేవంటూ నర్సులు విధులు బహిష్కరించారు. ప్రాణాలకు తెగించి కోవిడ్ విధులు చేస్తున్నా ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కనీసం మాస్కులు, పీపీఈ కిట్లు కూడా లేవన్నారు. శ్వాబ్ కలెక్షన్లు కూడా తమ చేతనే చేయిస్తున్నారని నర్సులు వాపోయారు. ఒక్క ఊడ్చే పని తప్ప మిగతావన్నీ తమతోనే చేయిస్తున్నారని వారు ఆరోపించారు. ఉన్నతాధికారులకు ఎన్ని సార్లు చెప్పినా కనీసం పట్టించుకోవడం లేదని నర్సులు ఆందోళనకు దిగారు.