గురువారం చేసిన దీక్షతో మోడీ పరిపాలన చేయలేని దద్దమ్మ అని తేలిపోయింది. ఒక నెల రోజులు మీరు సభ నడపలేదు అంటే అది మీ చేతకాని తనం .మీరు వెంటనే రాజీనామా చేయండని టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ డిమాండ్ చేసారు. శుక్రవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. చివరి నిమిషం వరకు చంద్రబాబు కేంద్రాన్ని నమ్మారు. కానీ కేంద్రం మోసం చేసింది.నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని మోసం చేసిన దొంగ అని జగన్ అంటే నేను వెంటనే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ప్రశాంతంగా ప్రజలు హాయిగా ఉంటే రాష్ట్రాన్ని దోచుకోవడానికి వస్తున్నారు. ఈ పాదయాత్రల వలన ఉపయోగం లేదని అయన అన్నారు. ఇప్పుడు జగన్ కృష్ణా జిల్లాకు వస్తున్నాడని చుట్టు పక్కల గ్రామాల నుంచి జనాన్ని తీసుకువస్తున్నారు. జగన్ మోడీ పేరు ఎత్తితే ఆయన కాళ్ళు పట్టుకుంటా
దయచేసి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించొద్దని సలహా ఇచ్చారు.