YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కేసీఆర్ ఎఫెక్ట్...పివి మావాడు...సోనియాగాంధీ

కేసీఆర్ ఎఫెక్ట్...పివి మావాడు...సోనియాగాంధీ

హైదరాబాద్ జూలై 25 
ఓ వైపు కేసీఆర్.. మాజీ ప్రధాని పీవీని మా తెలంగాణ బిడ్డ అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయనను కేసీఆర్ ఓన్ చేసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు పీవీని స్మరించుకోలేని దుస్థితి. పైనా సోనియాగాంధీకి పీవీ అంటే అస్సలు పడదు. ఈ నేపథ్యంలో కిందా మీదా పడ్డ కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు మారింది. తాజాగా పీవీ శతజయంతి సందర్భంగా సోనియా గాంధీ నుంచి మొదలుపెడితే రాహుల్ గాంధీ.. మన్మోహన్ సింగ్ అంతా పీవీ సేవలను కొనియాడారు. అయితే అది డైరెక్టుగా కాదు.. ఇన్ డైరెక్టుగా.. పీవీ ఖ్యాతిని కొనియాడుతూ తాజాగా సోనియా రాహుల్ మన్మోహన్ లు లేఖలు రాయగా.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ వాటిని గాంధీ భవన్ లో చదివి వినిపించారు. ఇలా పీవీ ఖ్యాతిని ఒక లేఖ ద్వారా కొనియాడి తన నచ్చని వ్యక్తిని పరోక్షంగా పొగుడుతూ సోనియాగాంధీ మమ అనిపించేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా సోనియా గాంధీ ఓ సందేశాన్ని గాంధీభవన్ కు పంపగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ చదివి వినిపించారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు తమవాడని.. అంకితభావం కలిగిన కాంగ్రెస్ వాది అని ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పీవీపై తొలిసారి స్పందించడం విశేషం.నెహ్రూ గాంధీ కుటుంబేతర వ్యక్తి దేశానికి ప్రధాని కావడం.. స్వతంత్రంగా వ్యవహరించడాన్ని ఇష్టం లేక నాడు పీవీని దూరంగా పెట్టారు సోనియాగాంధీ. ఆయన మరణిస్తే కూడా సరిగా అంత్యక్రియలు నిర్వహించలేదు. దాదాపు విస్మరించిన ఈ తెలుగు యోధుడిని కేసీఆర్ నెత్తిన ఎత్తుకోవడంతో కాంగ్రెస్ కూడా అన్యాపదేశంగా స్మరించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు సోనియానే కాదు.. రాహుల్ మన్మోహన్ కూడా పీవీ సేవలను కొనియాడుతూ ప్రశంసించారు. ఇదంతా కేసీఆర్ ఎఫెక్ట్ అని పలువురు సెటైర్లు వేస్తున్నారు.

Related Posts