ఏలూరు జూలై 25
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పరిస్థితులను బట్టి ఆంక్షలు విధిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక కేసులు నవెూదవుతున్న జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఒకటి. ఈ జిల్లాలో లాకడౌన్ ను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ఆదివారం జులై 31 వ తేదీ వరకు జిల్లాలోని ఏలూరు, తాడేపల్లి గూడెం, పాలకొల్లు, భీమవరం, నరసాపురం, కొవ్వూరులో లాక డౌన్ అమలు చేయబోతున్నారు. లాక డౌన్ అమలు జరిగినన్ని రోజులు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు నిత్యవసర వస్తువుల దుకాణాలు తెరిచి ఉంటాయి. ఉదయం 11 గంటల తరువాత షాపులు మూసేస్తారు. ఉదయం 11 తరువాత ఎవరూ కూడా రోడ్లవిూదకు రాకూడదని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.