YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

నవంబర్-డిసెంబర్ నెలల్లో కరోనా రెండో దశ.. శాస్త్రవేత్తల హెచ్చరిక

నవంబర్-డిసెంబర్ నెలల్లో కరోనా రెండో దశ.. శాస్త్రవేత్తల హెచ్చరిక

హైదరాబద్ జూలై 25 
కరోనాకు చలికాలం అంటే మహా ఇష్టం. అందుకే నవంబర్-డిసెంబర్ లో చైనాలో అత్యధిక చలి తీవ్రత ఉండే సమయంలోనే ఇది పుట్టింది ఆ దేశాన్ని అల్లకల్లోలం చేసింది. మన దేశానికి వచ్చేటప్పటికీ ఎండాకాలం కావడంతో మొదట్లో కాస్త నెమ్మదిగా సాగింది. ఇప్పుడు వానలతో తేమ పెరిగి విజృంభిస్తోంది. అయితే కరోనా వ్యాప్తి ఇది మొదటి దశ మాత్రమేనని.. రెండో దశ మనదేశంలో చలికాలం ప్రారంభమయ్యే నవంబర్-డిసెంబర్ లో మొదలవబోతోందనే హెచ్చరికను చేస్తున్నారు శాస్త్రవేత్తలు. చలికాలంలో కరోనా వైరస్ వ్యాప్తి బాగా ఉంటుందని తేలింది. ఎందుకంటే శీతల దేశాలైన అమెరికా యూరప్ దేశాల్లోనే ఈ వైరస్ వ్యాప్తి బాగా ఉంది. వేసవి దేశాల్లో తీవ్రత తక్కువగా ఉంది.దీన్ని బట్టి ఇప్పుడు కరోనా తొలిదశకే ఇంత మందికి సోకి.. ఇంతలా మనం కంగారు పడుతుంటే ఇక వచ్చే చలికాలంలో నవంబర్-డిసెంబర్ వరకు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం వెంటాడుతోంది.అక్టోబర్ లో ఆక్స్ ఫర్డ్ సహా పలు టీకాలు వస్తాయని అంటున్నారు. వస్తే డిసెంబర్ వరకు మనం కరోనాను కంట్రోల్ చేయవచ్చు. లేదంటే నవంబర్-డిసెంబర్ లలో కరోనా విజృంభణకు మరింత అల్లకల్లోలంగా మారి లక్షల ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related Posts