ఏలూరు, జూలై 25
ప్రతి ఉద్యోగి కష్టపడి పనిచేసి వారి తల్లిదండ్రులకు,తమ శాఖ కు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు అన్నారు. శనివారం కలెక్టరేట్లో తన ఛాంబర్లో జిల్లా పరిషత్ లో పనిచేసి వివిధ కారణలతో మరణించిన వారి కుటుంబ సభ్యుల కు కారుణ్య నియమకాలు క్రింద ఎంపికై 9 మంది జూనియర్ అసిస్టెంట్ లకు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు గా ఎంపిక అయిన వారిని వివిధ పాఠశాలలో నియమించి నట్లు తెలిపారు.ప్రతి ఉద్యోగి కష్టపడి పనిచేసి వ్యక్తిగతంగానూ , శాఖ పరం గాను ,మీ తల్లిదండ్రులు కు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి ఆయన అన్నారు. నూతనంగా నియమితులైన వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నాయని కష్టపడి పనిచేసి ఉన్నత స్థానాలు పొందాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సి.ఈ. ఓ. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.