కర్నూలు జూలై 25
కర్నూలు నగరంలోని స్థానిక హంద్రి నది తీర ప్రాంతాలు జెమ్మ చెట్టు, గరీబ్ నగర్, బుధవారపేట ప్రాంతాల్లో ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ శనివారం పర్యటించారు. జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, కెఎంసి కమిషనర్ డి.కే బాలాజీ, పోలీసు సూపరింటెండెంట్ పక్కీరప్ప, ఇతర ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే వెంట వున్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ హంద్రీలో సుమారు 20000 క్యూసెక్కుల నీరు విడుదలైంది. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. భయపడాల్సిన అవసరం లేదు కానీ అదే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
బాపుజీ నగర్, గరీబ్ నగర్. బుధవారపేట, జోహ్రాపురం వద్ద ప్రజలను ఖాళీ చేయాల్సిన అవసరం ఉన్నట్లయితే నాలుగు సహాయ కేంద్రాలను పెట్టమని కెఎంసి కమీషనర్ డి.కే బాలాజీని అయన కోరారు. పరిస్థితుల అవసరానికి అనుగుణంగా మేము సహాయక కేంద్రాలలో ఆహారం, పాలు, ఆశ్రయం కల్పిస్తామని ఎమ్మెల్యే అన్నారు.