YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బీజేపీకి దమ్ముంటే మహారాష్ట్ర సర్కార్ కూల్చండి : ఉద్ధవ్

బీజేపీకి దమ్ముంటే మహారాష్ట్ర సర్కార్ కూల్చండి : ఉద్ధవ్

ముంబై, జూలై 25, 
శివసేన అధికార పత్రిక ఎడిటర్ సంజయ్ రౌత్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇచ్చిన ఇంటర్వ్యూ తొలి భాగం శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో వైరస్ తీవ్రత, రాజస్థాన్ సంక్షోభం, చైనాతో సంబంధాలు సహా పలు కీలక అంశాలను ఠాక్రే ప్రస్తావించారు. ఈ క్రమంలో బీజేపీపై విమర్శలు గుప్పించిన ఠాక్రే.. వారితో తమకు వచ్చిన నష్టం లేదని ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాజకీయ పరిణామాలపై మాట్లాడుతూ.. బీజేపీకి దమ్ముంటే తన ప్రభుత్వాన్ని కూల్చాలని సవాల్ విసిరారు. చైనాతో విభేదాలపై స్పందించిన ఉద్ధవ్.. అంతర్జాతీయ సంబంధాల విషయంలో కేంద్రానికి స్పష్టమైన వైఖరి ఉండాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మనం చైనాను వ్యతిరేకిస్తున్నప్పటికీ భవిష్యత్తులో అదే మనకు మిత్ర దేశంగా మారే అవకాశాలను కొట్టిపడేయలేమని పేర్కొన్నారు. కాబట్టి అంతర్జాతీయ సంబంధాల విషయంలో మరింత శ్రమించాల్సిన అవసరం ఉందని ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు.లాక్‌డౌన్ ఎత్తివేయడంతో మళ్లీ వైరస్ విజృంభిస్తోందన్న ఠాక్రే.. పాశ్చాత్య దేశాల చర్యలను ఉదాహరణగా చెప్పారు. మరోసారి వైరస్ వ్యాప్తి చెందుతోందని గుర్తించి తిరిగి ఆంక్షలు విధించటానికి ప్రయత్నించాయని అన్నారు. ముంబయిలో వ్యాప్తి అదుపులో ఉన్నట్లు భావించి, ఉదాసీనంగా ఉండొద్దని హెచ్చరించిన సీఎం.. నేను దాని గురించి ఆందోళన చెందుతున్నాను అని అన్నారు. కోవిడ్-19పై పోరాటం సాగుతోందని, వైరస్ అదుపులోకి వచ్చిందని పలు దేశాలు లాక్‌డౌన్ ఎత్తేశాయని, మళ్లీ విజృంభించడంతో ఆస్ట్రేలియా వంటి దేశాలు తిరిగి లాక్‌డౌన్‌వైపు వెళ్తున్నాయన్నారు‘లాక్‌డౌన్ వల్ల ఆర్ధిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉందని ప్రతి ఒక్కరూ అంటున్నారు.. దీనికి నేను అంగీకరిస్తున్నాను. కానీ, ప్రజలు కరోనా బారిన పడినా లేదా వారు ప్రాణాలు కోల్పోయినా ఈ వ్యక్తులు బాధ్యత తీసుకుంటారా? ఆర్థిక వ్యవస్థ కోసం ప్రజలు మరణాలకు మీరు సిద్ధంగా ఉన్నారా?’ అని వ్యాఖ్యానించారు.కరోనా వైరస్‌ నియంత్రణకు కఠిన అంక్షలు విధించకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి.. నేను ట్రంప్‌ను కాదు.. నా కళ్ల ముందు ప్రజలు బాధపడటం చూడలేను అన్నారు. క్రమంగా ఆర్ధిక వ్యవస్థను పునఃప్రారంభించడంపై దృష్టి సారిస్తున్నాం.. ప్రజలు చాలా అలసిపోయిన మాట వాస్తవమే కానీ, అన్నింటినీ ఒకేసారి తెరవడం కుదరుదు.. దీనిని ఓ మహమ్మారిగా పిలుస్తున్నాం.. దీనికి సత్వర పరిష్కారం లేదు’ అని అన్నారు. ఆధ్యాత్మిక ప్రదేశాలను ఎప్పుడు తెరుస్తారని ప్రశ్నించగా.. దేవుడు మనతోనే ఉన్నాడని బదులిచ్చారు.‘తాము ఆర్మీ సహకారం కోరడంలేదు, క్షేత్రస్థాయిలో ఆస్పత్రులు, వైద్య సదుపాయాల కల్పనకు ప్రయత్నించాం.. తరుచూ సమావేశాలు నిర్వహించి, నిర్ణయాలు తీసుకుని దానికి అనుగుణంగా ముందుకెళ్తున్నాం.. ప్రభుత్వ పనితీరుపై చాలా గర్వంగా ఉంది’అని అన్నారు

Related Posts