YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఇరాన్ విమానం కూల్చడానికి అమెరికా ప్రయత్నం

ఇరాన్ విమానం కూల్చడానికి అమెరికా ప్రయత్నం

సిరియా, జూలై 25, 
ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి 2018లో అమెరికా వైదొలగిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. మాతో పెట్టుకోక తట్టుకోలేవని ఇరాన్‌ను అమెరికా హెచ్చరిస్తే... మేమెవరికీ భయపడేది లేదని ఇరాన్ ఎదురు దాడిచేస్తోంది. ఈ ఏడాది జనవరిలో బాగ్దాద్ విమానాశ్రయం వద్ద ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ ఖాసీం సులేమానీని అమెరికా సైన్యం హత్యచేయడంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ మరింత ముదిరి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెంచే సంఘటన సిరియా గగనతలంలో గురువారం చోటు చేసుకుంది. తమ పౌర విమానాన్ని కూల్చేయడానికి అమెరికా ప్రయత్నించిందని ఇరాన్ ఆరోపించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ నుంచి లెబనాన్‌ రాజధాని బీరుట్‌కు వెళుతున్న మహన్ ఎయిర్‌లైన్స్ విమానంపైకి అమెరికా ఎఫ్‌-15 యుద్ధ విమానం దూసుకొచ్చిందని.. దీంతో చాలా మంది ప్రయాణికులు గాయపడ్డారని ఇరాన్‌ పేర్కొంది. సంఘటనకు సంబంధించిన వీడియోలను ఇరానియన్‌ టీవీ ప్రసారం చేసింది.ఊహించని విధంగా అమెరికా యుద్ధ విమానం.. తమ విమానానికి సమీపంగా దూసుకు రావడంతో పైలట్‌.. ఒక్కసారిగా ఎత్తును పెంచి తగ్గించాల్సి వచ్చిందని.. దీంతో ప్రయాణికులు గాయపడ్డారని ఇరాన్‌ తెలిపింది. అయితే, ఈ ఆరోపణలను అమెరికా ఖండించింది. సిరియాలోని తమ సైనిక స్థావరం మీదుగా వెళుతున్న విమానాన్ని ప్రొటోకాల్‌లో భాగంగానే 1,000 మీటర్ల దూరం నుంచి ఎఫ్‌-15 జెట్‌ పరిశీలించిందని అమెరికా ఓ ప్రకటనలో తెలిపింది.ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టనున్నట్టు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఒక్కసారిగా విమానం ఎత్తును పెంచడంతో లోపలి ప్రయాణికులు కుదుపునకు గురయి రూఫ్‌కి తగలడంతో తలకు గాయాలైనట్టు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఏం జరిగిందో తనకు తెలియదు.. ఓ నల్ల విమానం నేను ప్రయాణిస్తున్న విమానానికి దగ్గరగా దూసుకురావడంతో అదుపు తప్పింది.. దీంతో బ్యాగేజీ సీలింగ్‌కు తల బలంగా తగిలిందని ఓ ప్రయాణికుడు తెలిపాడు. ఇదిలా ఉండగా నల్ల సముద్రం ప్రాంతంలోని తమ గగనతలంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన అమెరికా గూఢచర్య విమానాన్ని సుఖోయ్‌-27 జెట్‌తో తరిమేశామని రష్యా రక్షణ శాఖ శుక్రవారం ప్రకటించింది

Related Posts