YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా

శివరాజ్ సింగ్  చౌహాన్ కు కరోనా

భోపాల్, జూలై 25, 
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కోవిడ్-19 అనుమానిత లక్షణాలు బయటపడటంతో పరీక్ష చేయించుకున్నట్టు తెలిపిన ముఖ్యమంత్రి.. ఈ ఫలితాల్లో వైరస్ పాజిటివ్‌గా వచ్చిందని తెలిపారు. ‘తనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, తనతో కాంటాక్ట్ అయినవారు, సహచరులు కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు దగ్గరగా ఉన్న వ్యక్తులు క్వారంటైన్‌కు వెళతారు’అని శివరాజ్‌సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.‘వైద్యుల సలహాలను, నిబంధనలు పాటించి చికిత్స తీసుకుంటాను.. మార్చి 25 నుంచి రోజూ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని సమీక్షిస్తున్నాను. ప్రస్తుతం వీలైనంత వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించడానికి ప్రయత్నిస్తాను’అని తెలిపారు. కరోనా పరిస్థితులపై నిర్వహించే సమీక్షల్లో తన స్థానంలో హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా, పట్టణాభివృద్ధి, పరిపాలన మంత్రి భూపేంద్ర సింగ్, వైద్య ఆరోగ్య విద్య మంత్రి విశ్వాస్ సారంగ్, ఆరోగ్య మంత్రి డాక్టర్ పీఆర్ చౌధురి .. చికిత్స తీసుకుంటూ కోవిడ్-19 జయించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను’ అన్ని అన్నారు.బుధవారం జరిగిన మంత్రవర్గ సమావేశానికి హాజరైన మంత్రి అరవింద్ సింగ్ భదోరియాకు ఆ మర్నాడే వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్యాబినెట్ భేటీకి హాజరైన మంత్రి.. గతవారం భోపాల్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఇందులో బీజేపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన క్యాబినెట్ సమావేశానికి హాజరు కాగా.. అదే రోజు స్వల్ప లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. వైరస్ నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకూ మధ్యప్రదేశ్‌లో మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. అక్కడ మొత్తం పాజిటివ్ కేసులు 25వేలకు చేరగా.. 7,300 మంది ప్రాణాలు కోల్పోయారు.

Related Posts