YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్...శుభవార్త ఎప్పుడు ఎంపీ కోమటిరెడ్డి ప్రశ్నలు

కేసీఆర్...శుభవార్త ఎప్పుడు ఎంపీ కోమటిరెడ్డి ప్రశ్నలు

నల్గొండ, జూలై 25, 
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రాశారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన ఓ హామీని గుర్తు చేశారు. రెండు నెలల క్రితం కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం రోజున సీఎం కేసీఆర్ రైతులకు శుభవార్త చెబుతానని అన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం జరిగి దాదాపు రెండు నెలలు గడుస్తోందని, మరి కేసీఆర్ రైతులకు చెబుతానని చెప్పిన ఆ శుభవార్త ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వం చేసిన రూ.25 వేల లోపు రుణమాఫీ వారి వడ్డీలకే సరిపోలేదని గుర్తు చేశారు.‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని విస్మరించడం ఎంతవరకు కరెక్టు. మిగతా హామీల తరహాలోనే ఇది కూడా బోగస్ హామీనా? వెంటనే మీరు ఇచ్చిన ఆ హామీని నిలబెట్టుకోవాలి. లేకపోతే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రైతులకు కేసీఆర్ క్షమపణ చెప్పాలి.’’ అని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్లే చెరువులు నిండాయని, ఇందులో కేసీఆర్ గొప్పతనం ఏమీ లేదని కొట్టిపారేశారు.కాంగ్రెస్ హయాంలో 90 శాతం పూర్తయిన ఎస్‌ఎల్‌బీసీ, బ్రాహ్మణ వెల్లంల, పాలమూరు రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులను కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అదనంగా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించలేదని ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు.

Related Posts