YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

నిష్కామ కర్మ

నిష్కామ కర్మ

నిష్కామ కర్మ నిజంగా అత్యంత సులభమైనది. చాలా మంది ఏమంటారూ అంటే, మనజీవితంలో  మనం చేస్తున్న ప్రతిపని మవకు అవసరమైనదిగానే ఉంటుంది. అనవసరమైన పని మనం చేయము. కారణం ,మనం పిచ్చివాళ్ళం కాదుగదా! (నిజమే, చేయవలసిన పనులనే కుంటిసాకు చెప్పి మానుకుంటుంటాముగదా. ఇంక అనవసరమైన పని ఎందుకు చేస్తాము) మరి అవసరమైన పనిచేసినపుడు ఫలికం ఆసించకుండా ఎలా వుంటామూ అని._(ఇలా అడుగుతుంటారు)
ఒక్క విషయం ఆలోచించండి.  చేసిన  ప్రతిపనికీ ఒక ఫలితముంటుంది.  అయితే ఆఫలితం ఒక్కోక్కసారి ప్రతికూల
ఫలితాన్ని ఇస్తాయి. దాంతో ఆపని వృదాఅయిందని అంటాము. ఆలోచిస్తే ఏపనీ నిజంగా వృదాకాదు. కాకపోతే ఫలితం మనకు అనుకూలంగా రాలేదు. అంతేగాని, పని జరిగిందీ అంటే ఫలితం మాత్రం వచ్చి తీరుతుంది. అనుకూల ఫలితం రావాలనీ, వస్తుందనీ గదా పనిచేశావు. మరి రాలేదెందుకని?
దీని వలన మనం తెలుసుకోవాలిసింది ఏమంటే,ఫలితం ఇచ్చేవాడు వేరెవరో తప్పక ఉన్నాడని. వాడు నిష్పక్షపాతంగా ఫలితాలనిచ్చేవాడు కనుకనే, నీపనుల ప్రతిఫలాలు అనుకూలంగానూ, ఫ్రతికూలంగానూ, మిశ్రమంగానూ ఫలితాలు వస్తూవుంటాయి. ఆ ఇచ్చేవాడే భగవంతుడు. The "G O D".(Global Organisation Designer)
ఆభగవంతుడు తన భగవద్గీతోపదేశంలో  చెప్పిందానియోక్క  అర్ధమేమంటే, "పనిచేయడానికి మాత్రమే నీకు అధికారముంది. కానీ,దాని ప్రతిఫలం ఆశించడానికి (ప్రతిఫలం ఇలా ఉండాలని ఆశించ నిర్ణయించడానికి)  అధికారంమాత్రం నీకు లేదు" అని. పని అత్యంత శ్రధ్ధతో చేయి, కానీ ఫలితం ఇలానే ఉండాలని ఎదురుచూడకుండావుండు. అపుడు ప్రతిఫలం అనుకూలంగా న్నా, ప్రతికూలంగాఉన్నా అది నిన్ను బాధించదు. అనిగదా చెప్పాడు.
ఇపుడు మరో విషయం చెప్పుకోవాలి. మనం శ్రద్ధతో చేసిన పని తప్పక సరైన అనుకూలఫలితం ఇవ్వాలిగదా అనుకుంటాము. ఫలితాన్ని నిజంగా నిర్ణయించేది మనం చేసిన కర్మయే. ఇది మాత్రంనూటికి నూరుపాళ్ళు పరమ యదార్ధం.  మరి సానుకూల ఫలికం ఎందుకురాదు? ఇదేం విచిత్రం. అనుకుంటున్నారా! ఇది మీకు అర్ధం కావడానికి మనజీవితంలో ప్రతిసారీ ఎదురయ్యే ఒక మంచి ఉదాహరణ చెబుతాను.  మనం cell phone లో బ్యాలెన్స్ అయిపోయిందనుకోండీ.  ఎవరికైనా రింగ్చేస్తే, కంపెనీవాళ్ళు మాట్లాడుతారు.  మీఫోనులో బ్యాలెన్స్లేదు. కనుక ఫలాని నంబరుకు Dial (డయల్) చేయండీ. 10 రూపాయలు మీకు రీచార్జి చేయబడుతుంది. Next rechargeలో cut చేయబడుతుంది అంటారు.  అదిగూడ అయిపోతుంది. మీరు రీచార్జి చేయించలేదు. మీరు ఆవిషయం మర్చిపోతారు. 10 రోజుల తరవాత రీచార్జి చేయిస్తారు. 50 రూ. చేయిస్తే 42 రూ వచ్చి వుంటుందని ఎదురుచూస్తారు. కానీ 30రా. మాత్రమే వస్తుంది. మీరేమనుకుంటారు? కంపెనీవాళ్ళు మోసం చేశారు.  పదిరూపాయలు తగ్గించారని కోపం వస్తుంది. మీకురావలసిన ప్రతిఫలం వ్యతిరేకంగా వచ్చింది. మీకర్ధంగాదు తిరిగి ఫోనుచేసి enquiry లో అడిగితే 10 రూ. అప్పుతీసుకున్నారని గుర్తు చేస్తారు. అవునా.కాదా?. మరి మనకర్మకు సరైన ప్రతిఫలం రాలేదని భగవంతుడికి ఫోనుచేసి ఎంక్వయిరీ చేయగలమా.  నీవు గతంలో ేంకర్మ చేశావో నీకు గుర్తుండే అవకాశంలేదు. కనుక ప్రతికూల ఫలాలను అనుభవించలేక అవస్తపడుతూ అనుభలడవిస్తావు.  నిజానికి నీకర్మమే నిన్ను కష్టాలలోకి తోసిందిగానీ, పక్షపాతరహితుడైన భగవంతుడు గాదు.(కంప్యూటర్కు పక్షపాతం ఉండదు. నివు తీసుకున్న అప్పు గుర్తుచేసి రెండునెలల తరువాతనైనాసరే నీ next recharge చేసినపుడు  నీవు గతంలో తీసుకున్న అప్పు నీ amount లో cutచేసుకోని మాత్రమో నీకు అందిస్తుంది. అలాగే భగవంతుడుడు కూడా. మవం మరచిపోయినా సరే జన్మల తరువాతనైనా సరే,గుర్తుచేసుకోని మరీ నీకు ఫలాలను అందిస్తాడు. అవిసరిగ్గానే ఉంటాయన్నదినిజం.  నీకు తెలియకపోవచ్చు.
అందుకనే కర్మచేస్తూఉండు. వచ్చిన ఫలితం మంచిదైనా ,చెడ్డదైనా భగవంతుడి ప్రసాదంగా స్వీకరించు. సంతోషంగా అనుభవించు. ఇదే జ్ఞానులు అనుసరించే పద్ధతి.

Related Posts