YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వివేకా కేసులో ఇరుక్కునేది ఎవరు

వివేకా కేసులో  ఇరుక్కునేది ఎవరు

కడప, జూలై 27, 
ఏపీ రాజకీయాల్లో గత ఏడాది చోటుచేసుకున్న సంఘటనల్లో కీలకమయింది ఏపీ ఎన్నికలకు ముందు జరిగిన మాజీమంత్రి వివేకానందరెడ్డి దారుణహత్య. గత ఏడాది మార్చి 15న వైఎస్‌ వివేకా హత్యకు గురైన విషయం తెలిసిందే. చంద్రబాబు హయాంలో జరిగిన ఈ సంఘటన రాజకీయాల్లో పెను సంచలనం రేపిందనే చెప్పాలి. ఈ కేసుని అప్పటి సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేసుని సిట్ కి అప్పగించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఈ కేసు విచారణపై ఫోకస్ పెట్టారు. వందలాదిమంది అనుమానితులను సిట్ విచారించింది. వివేకా హత్యకేసు దర్యాప్తులో మలుపు... కీలకవ్యక్తులపై సిబిఐ విచారణసిట్ ఎన్నినెలలు దర్యాప్తు జరిపినా, ఎంతోమందిని ఎంక్వైరీ చేసినా ఇంకా కొలిక్కి రాలేదు. ఈ కేసును ఏపీ హైకోర్ట్ మార్చి నెలలో సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆయన భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత వేసిన పిటిషన్ పై హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐ విచారణకు న్యాయస్థానం ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టాలని హైకోర్టు ఈ సందర్భంగా సీబీఐకి సూచించింది. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పిటిషన్లను కొట్టివేసింది. సీబీఐ విచారణ పిటిషన్ వైఎస్ జగన్ ఉపసంహరణ చేసుకోవడంతో ఆ పిటిషన్‌ను హైకోర్టు క్లోజ్ చేసింది.  దీంతో వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.కడపలోని ఆయన స్వగృహంలో గత ఆరు గంటలుగా విచారణ కొనసాగుతోంది. ఈ హత్య కేసులో సీబీఐ అధికారులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తున్నారు.ఉదయం 11 గంటల నుంచి ఈ ప్రక్రియ కొనసాగింది. హత్యజరిగిన రోజు ఏం జరిగి ఉంటుందన్న దానిపై సునిశితంగా పరిశీలిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని సీబీఐ సాంకేతిక బృందం పరిశీలిస్తోంది. అణువణువూ శోధిస్తోంది.
వివేకానందరెడ్డి హత్యకు గురయిన రాత్రి, హత్య జరిగిన సమయంలో ఇంటిలో ఎవరున్నారనేదానిపై పరిశీలిస్తున్నారు. వాచ్‌మన్‌ రంగన్నను ఘటనాస్థలికి తీసుకెళ్లి సీబీఐ అధికారులు విచారించారు. మరో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డి, డ్రైవర్‌ ప్రసాద్‌ని వివేకా ఇంటికి పిలిపించి సీబీఐ అధికారులు విచారించారు.కేసు విచారణలో భాగంగా ఢిల్లీ, తమిళనాడు నుంచి ప్రత్యేక బృందంగా వచ్చిన అధికారులు కడపలోనే మకాం వేశారు. కడప నుంచి పులివెందుల రోజూ వెళ్తూ విచారణ జరుపుతున్నారు. ఈ హత్యకేసులో అనుమానితులుగా ఉన్నవారందరినీ సీబీఐ విచారించనుంది. మొత్తం మీద సంచలనం రేపిన ఈ హత్యకేసులో ఎవరు నిందితులుగా తేలతారోనని యావత్ రాష్ట్రం ఎదురుచూస్తోంది

Related Posts