YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రపంచంలో ఐదో రిచ్చెస్ట్ అంబానీ

 ప్రపంచంలో ఐదో రిచ్చెస్ట్ అంబానీ

ముంబై, జూలూ 27, 
 బిలినియర్ ముకేశ్ అంబానీ ప్రపంచంలోనే ఐదో అత్యంత సంపన్నుడిగా అవతరించారు. స్టీవ్ బాల్మర్‌‌‌‌ను అధిగమించి, 77.4 బిలియన్ డాలర్ల(రూ.5,78,369 కోట్లు) సంపదతో ముకేశ్ అంబానీ ఈ స్థానాన్ని సంపాదించుకున్నా రు. శుక్రవారం ముకేశ్ సంపద 3.5 బిలియన్ డాలర్లు పెరిగి, మార్క్ జుకర్‌‌‌‌బర్గ్‌ కు దగ్గరగా వెళ్లారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ముకేశ్ సంపద 22.3 బిలియన్ డాలర్ల మేర పెరిగింది . జనవరి నుం చి ముకేశ్ బ్లూ మ్‌ బర్గ్ బిలీనియర్ ఇండెక్స్‌ లో తొమ్మిది స్థానాలు పైకి జంప్ చేశారు. ముకేశ్‌‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు మార్చిలో కనిష్ట స్థా యిల నుం చి 145 శాతం పెరిగాయి.ఫేస్‌‌బుక్ ఇంక్, సిల్వర్ లేక్, బీపీ పీఎల్‌ సీటి సంస్థలు ముకేశ్‌‌కు చెంది న జియో ప్లాట్ ఫామ్లో పెట్టుబడులు పెట్టడంతో రిలయన్స్ షేర్లు మెరుపులు మెరిపించాయి. దీంతో ముకేశ్ సంపద కూడా ఆగమేఘాల మీద పెరిగింది . రెండు వారాల క్రితమే ముకేశ్, వారెన్ బఫెట్‌‌ను దాటేసి నెంబర్ 6 ప్లేస్‌‌లోకి వచ్చారు. ఎలాన్ మస్క్, గూగుల్ కో ఫౌండర్స్ సెర్జి బ్రిన్, ల్యా రీ పేజ్‌ లను కూడా ముకేశ్ దాటేశారు. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ సంపద కూడా ఈ ఏడాది 64 బిలియన్ డాలర్లు పెరిగింది.

Related Posts