ముంబై, జూలై 27,
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్–2020 డేట్స్ వచ్చేశాయి. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్8 వరకు టోర్నీ జరుగుతుందని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ శుక్రవారం ప్రక టించారు. ఇదే విషయాన్ని ఎనిమిది ఫ్రాంచైజీల కు తెలియజేశామన్నారు. మొత్తం 51 రోజుల పాటు ఫుల్ షెడ్యూల్ను రూపొందిస్తున్నారు. అలాగే ఇతర దేశాల టోర్నీలతో క్లాష్ రాకుండా ఈ తేదీలను కన్ఫాం చేశారు. కరీ బియన్ ప్రీమియర్ లీగ్ సెప్టెంబర్ తో ముగుస్తుండటంతో అందులో పాల్గొనే ప్లేయర్లు నేరుగా ఐపీఎల్ కు రానున్నారు. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సిరీస్ మాత్రం సెప్టెంబర్ 15న క్లోజ్ అవుతుంది. మధ్యలో నాలుగు రోజుల సమయమే ఉండటంతో ప్లేయర్లకు ఇబ్బంది అవుతుందేమోనని కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ఇప్పటికైతే ప్రాబ్లం లేదు. మధ్యలో నాలుగు రోజుల సమయం ఉంటుంది. కాబట్టి సిరీస్లో పాల్గొనే ప్లేయర్లు నేరుగా యూఏఈ వచ్చేస్తారు. ఈ విషయంపై ఫ్రాంచైజీలకు ఏమైనా అనుమానాలు ఉంటే మీటింగ్ లో క్లారి ఫై చేస్తాం. ఇండియన్ గవర్నమెంట్ పర్మీషన్ కూడా త్వరలోనే వస్తుంది’ అని పటేల్ వెల్లడించారు. దుబాయ్, అబుదాబి, షార్జాలో మ్యాచ్ లు మొత్తం మ్యాచ్ లను దు బాయ్ , అబుదాబి, షార్జాలో నిర్వహించేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. వీటితో పాటు ఐసీసీ క్రికెట్అకాడమీని కూడా తీసుకోవాలని యోచిస్తోంది. ఇందులో 38 టర్ఫ్ పిచ్ లు , 6 ఇండోర్ పిచ్ లు , 5700 స్క్రైర్ ఫీట్ ఏరియాతో పాటు , ఫిజియోథెరపీ మెడిసిన్ సెంటర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం యూఏఈఎయిర్ లైన్స్ ఆపరేషన్స్ ను ఇంకా మొదలు పెట్టలేదు. కాబట్టి చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరి కొన్ని రోజుల్లోనే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(ఎస్ఓపీ)ని.. యూఏఈ బోర్డుకు అందజేస్తామని, దాని ప్రకారమే ప్లేయర్లు, ఫ్రాంచైజీలు నడుచు కోవాలని పటేల్ తెలిపారు. స్టేడి యాల్లోకి ఫ్యాన్స్ ను అనుమతిం చాలా? వద్దా? అన్నది యూఏఈ గవర్నమెంట్ పై ఆధారపడి ఉంటుంది. కరోనా నెగెటివ్ రిపోర్ట్ ఉంటే అక్కడ క్వారంటైన్ అవసరం లేదు. ఒకవేళ లేకపోతే టెస్ట్చేయించాల్సి ఉంటుంది. వీటన్నింటి పై జీసీ తర్వాత పూర్తి క్లారిటీ వస్తుంది’ అని పటేల్ పేర్కొన్నారు.