YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీవైపు...ఆనం బ్రదర్స్ చూపు

వైసీపీవైపు...ఆనం బ్రదర్స్ చూపు

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం వారికి ప్రత్యేక స్థానం ఉంది. ఏ పార్టీలో ఉన్నా… జిల్లాపై తమ ప్రభావం ఉండేలా చూడటంలో ఆనం వాళ్లు చాలా సార్లు సక్సెస్ అయ్యారు.నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో సుదీర్ఘ అనుభ‌వం ఉన్న ఆనం సోద‌రుల‌కు ప‌ద‌వుల పిచ్చి ప‌ట్టుకున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. దివంగ‌త మాజీ సీఎం ఎన్టీఆర్ ఆనం బ్ర‌ద‌ర్స్‌కు రాజ‌కీయ భిక్ష పెట్ట‌డంతో వీరి రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లైంది. ఆ త‌ర్వాత కాంగ్రెస్‌లోకి జంప్ చేసిన వీరు కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న‌లో మంత్రులయ్యారు. ఎంత వ‌ర‌కు జిల్లా రాజ‌కీయాల‌ను శాసించాలి…తాము ప‌ద‌వుల్లో ఉండాల‌న్న బ‌ల‌మైన కాంక్ష‌తో ఉన్న వీరు గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో అధికారంలో ఉన్న టీడీపీలో చేరారు.టీడీపీలో ఉన్న చంద్ర‌బాబు ఆనం సోద‌రుల‌కు ఆత్మకూరు టిక్కెట్‌తో పాటు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. లేడికి లేచిందే ప‌రుగు అన్న‌ట్టు వీరు టీడీపీలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి త‌మ‌కు ప‌ద‌వులు కావాల‌ని అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం స్టార్ట్ చేసేశారు. రామ‌నారాయ‌ణ‌రెడ్డికి వ‌చ్చిన వెంట‌నే ఆత్మ‌కూరు ఇన్‌చార్జ్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇక వివేక‌కు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుగా ఎప్పుడైనా ఎమ్మెల్సీ ఇస్తాన‌న్నారు. అయితే కొన్నేళ్ల క్రితం టీడీపీలో చేరిన ఆనం బ్రదర్స్ కు పార్టీలో సరైన ప్రాధాన్యత లేదనే ప్రచారం జరుగుతోంది. పార్టీలో చేరి చాలాకాలం తరువాత తమకు పదవులు రావడం లేదనే బాధ వారిలో ఉందని కొందరు చర్చించుకుంటున్నారు.ఈ క్రమంలో వాళ్లు వైసీపీ వైపు చూస్తున్నారనే ఊహాగానాలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆనం బ్రదర్స్ లో పెద్దవాడైన ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోనే ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆనం ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసిన చంద్రబాబు… స్వయంగా ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అయితే ఈ సమయంలో ఆనం రామనారాయణరెడ్డి ఆయన వెంట లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోనే ఉన్నా… ఆనం రామనారాయణరెడ్డి చంద్రబాబుతో కలిసి ఆస్పత్రికి వెళ్లలేదని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. అంతేకాదు… కొద్ది రోజుల క్రితం వివిధ పార్టీల్లో ఉన్న ఆనం సోదరులు రామనారాయణరెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, జయకుమార్ రెడ్డి కలిసి చర్చలు జరపడం ఇప్పుడు నెల్లూరు జిల్లా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.రామనారాయణరెడ్డిని వైసీపీలోని తీసుకెళ్లేందుకు ప్రస్తుతం వైసీపీలో ఉన్న విజయ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని… టీడీపీలో ఎంతకాలం ఉన్నా తమకు పదవులు రావని ఆయన తన సోదరులకు నచ్చజెబుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో త్వరలోనే ఆనం బ్రదర్స్ అంతా కలిసి రాజకీయంగా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే జగన్ తో కలిసి పనిచేసే విషయంలో మొదటి నుంచి విముఖంగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి… వైసీపీలో చేరడానికి అంగీకరిస్తారా అనే అంశం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది

Related Posts