YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ కు కలిసిసొస్తున్న కాలం

జగన్ కు కలిసిసొస్తున్న కాలం

విజయవాడ, జూలై 28, 
లిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తాడని సామెత. జగన్ కి ఇపుడు అంతా అనుకూల కాలం నడుస్తోంది. అందుకే ఆయన దూకుడు ఓ రేంజిలో ఉంది. ఇదే జగన్ పదేళ్ళ క్రితం కాంగ్రెస్ నాడే కరుణించి ముఖ్యమంత్రిని చేస్తే ఇపుడు ఎక్కడ ఉండేవారు. అంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాదిరిగానే మాజీ సీఎం గా మౌనంగా ఎక్కడో అని సమాధానం వస్తుంది. ఇక జగన్ విషయంలో నాడే బాగా అతి చేసిన‌ చంద్రబాబు కూడా ఇపుడు అక్కడే ఉన్నారు. జగన్ మానాన నాడు ఆయనను వదిలేస్తే ఇంత పెద్ద నాయకుడు అయ్యేవారూ కాదు, పేరూ వచ్చేది కాదు, అరవయ్యేళ్ళ వయసులో తెరచాటు రాజకీయాలు చేసిన బాబు డెబ్బయ్యో పడిలోకి వచ్చిన తరువాత జగన్ కి అధికారం అప్పగించేసి విపక్షంలో విలవిలలాడుతున్నారు.ఏపీలో జగన్ గ్రాఫ్ పెరగడానికి చంద్రబాబు కూడా కారణం అని చెప్పాలి. ఎన్నికల్లో ఇచ్చిన మాటను తప్పడం బాబు నైజం అయితే నిలబెట్టుకోవడానికి ఎందాకైనా అన్నది జగన్ తీరు. అందుకే తొలి ఏడాదిలోనే వాటిని అమలు చేసి చూపించారు. ఇక జగన్ సంక్షేమాన్ని ఆయుధంగా చేసుకున్నారు. జగన్ విషయంలో టీడీపీ ఎన్ని ఆరోపణలు చేస్తున్నా ఆయన ఇచ్చిన సొమ్ము అందుకుంటున్న వారు కానీ లబ్దిదారులు కానీ కిక్కురుమనరు. వారెవరూ బాబుకు బాసటగా నిలవరు. ఇక మాజీ మంత్రుల అరెస్ట్ అన్నది పూర్తిగా టీడీపీ సొంత వ్యవహారంగా భావిస్తున్నారు. ఎంత అరచి గీ పెట్టినా బాబే తన పార్టీని కాపాడుకోవాలి తప్ప పోలోమంటూ బీసీలూ, బడుగులు వచ్చేసి మా కులం వారిని అరెస్ట్ చేస్తున్నారని గగ్గోలు పెట్టరు కాక పెట్టరు.ఇక జగన్ చాలా తెలివిగా గత ప్రభుత్వ అవినీతిని మాత్రమే వెలికితీయడంలేదు. చంద్రబాబు విశ్వసనీయతను కూడా అటు జనంలో, ఇటు ఆయన సొంత పార్టీలో ప్రశ్నార్ధకం చేస్తున్నారు. బీసీలైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను ఎమ్మెల్సీలను చేసి మంత్రులను చేసి ఇపుడు పెద్దల సభకు పంపారు. ఇక తనవారు అనుకుంటే ఎంతటి ఉన్నత పదవులు అయినా ఇస్తాను అని చెప్పడానికి ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టిన తీరు కూడా నిదర్శనం. ఇది ఇపుడు టీడీపీలో పెద్ద ఎత్తున బాబు జగన్ ల మధ్యన పోలికల చర్చకు తావు ఇస్తోంది. ఇక జనంలో వరసగా నెరవేరుస్తున్న హామీలు కూడా చంద్రబాబు మాట తప్పడాన్ని, ఆయన విశ్వసనీయతను ప్రశ్నించేదే. అంటే బాబు రాజకీయ పునాదులు కదిలిపోయేలా ఆయన విశ్వసనీయతనే జగన్ జనంలో పెట్టేస్తున్నారు.ఇక ఒక్కండు నీ మొర ఆలకింపడు అని భారతంలో చెప్పినట్లుగా చంద్రబాబు పరిస్థితి ఇపుడు తయారైంది. తెలంగాణాలోని కేసీయార్ తో బాబు సున్నం పెట్టుకున్నారు. కేంద్రంలోని మోడీతో ఢీ కొట్టారు. మరో వైపు ఎన్నికల ముందు వరకూ కలసి తిరిగిన కాంగ్రెస్ విపక్ష కూటమికి గుడ్ బై చెప్పి అతి పెద్ద తప్పు చేశారు. ఇపుడు మళ్లీ మోడీ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ టైంలో కనుక బాబు విపక్ష కూటమిలో ఉన్నట్లు అయితే కనీసం ఏపీ రాజకీయ పరిణామాల మీద సోనియా కానీ, వామ‌పక్ష నేతలు, ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు స్పందిచేవారు. బాబు కప్పదాటు వైఖరితోనే టోటల్ గా దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నమ్మకాన్ని ఒకేసారి పోగొట్టుకున్నారని అంటున్నారు.ఇదే ఇపుడు జగన్ కి బాగా సానుకూలం అవుతోంది. బాబు ఏమీ చేయలేని నిస్సహాయత జగన్ బలాన్ని రెట్టింపు చేస్తోంది. ఆయన దూకుడుగా సాగేందుకు కూడా ఇంధనం అవుతోంది. బాబు ఇదివరకు రాజకీయం వేరు, జగన్ ని ఎదుర్కోవడం వేరు. బాబు నలభయ్యేళ్ల రాజకీయాల్లో జగన్ అనే కొరుకుడు పడని పాఠాన్ని ఎక్కడా చదివి ఉండరు. అందుకే ఇపుడు మళ్ళీ మళ్లీ చదివి కానీ జవాబులు రాయలేరు. ఇక బాబు మంచి వ్యూహకర్తను అని చెప్పుకోవడం కాదు, కాలాతీతమైన వ్యూహాలు ఉండవని మరచిపోవడమే విషాదం. పాతకాలం ఎత్తులతో జగన్ ని ఎదుర్కోవాలంటే టీడీపీకి తల బొప్పి కట్టడం తప్ప మిగిలేది ఏదీ ఉండదని అంటున్నారు. ఏది ఏమైనా ఇపుడు జగన్ హవా నడుస్తోంది.

Related Posts