2014 ఎన్నికల్లో దేశంలో ప్రభంజనం సృష్టించిన బీజేపీ సీనియర్ నేత, గుజరాత్ మాజీ సీఎం నరేంద్ర మోడీ.. అప్పట్లో భారీ విజయం నమోదు చేశారు. ఇంతలా నాలుగేళ్ల కిందట ప్రభంజనం సృష్టించిన నరేంద్ర మోడీ.. పరిస్థితి ఇప్పుడు ఏమైంది? ఆయన అప్పట్లో ఎంత భారీ విజయం నమోదు చేశారో.. ఇప్పుడు అంతకంటే ఓ రెండు పాళ్లు భారీ వైఫల్యాన్ని, ఫెయిల్యూర్‌ను నమోదు చేస్తున్నారా? అనే చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతోంది. దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లు.. ఆయన హవాకు తిరుగులేదు. ఆయన పేరుకు తిరుగులేదు. అయితే, రానురాను ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయనకే బూమ రాంగ్ మాదిరిగా తగులుకున్నాయిదేశంలో ఇక, జాతీయ పార్టీలకు నూకలు చెల్లాయని, ప్రాంతీయ పార్టీలతో అంటకాగితే తప్ప కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి వచ్చిందని అనుకున్న తరుణంలో మోడీ విజృభించారు. మేజిక్ ఫిగర్‌కు మరో నాలుగు అంకెలు ఎక్కువగానే ఎంపీలను సాధించుకున్నారు. మిత్రపక్షాల్లో బీజేపీకి నాడు వాజ్‌పేయ్, అద్వానీ టైం నుంచి ఎంతో నమ్మదిగిన మిత్రులుగా ఉన్న టీడీపీయే కాదు… మహారాష్ట్రలో శివసేన సైతం మోడీ పేరు చెపితే మండిపడుతోంది. ఎంత దారుణం అంటే వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగితే 7 సిట్టింగ్ ఎంపీ సీట్లను బీజేపీ కోల్పోయింది. ఈ పరిణామాలకు తోడు పార్లమెంటులో ఇటీవల జరిగిన అవిశ్వాసం రగడ మరింతగా ప్రధాని మోడీని దౌర్బల్యుడిగా లెక్కగట్టేలా చేసింది. అవిశ్వాసంపై చర్చకు సిద్ధమని ప్రకటిస్తూనే తమిళనాడు ఎంపీల ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలను వాయిదా వేసిన తీరుకు దేశంమొత్తం నివ్వెరపోయేలా చేసింది.దీంతో ఒక్కసారిగా దేశం మొత్తం నివ్వెర పోయింది. నీ కంటే పొడిచే మొనగాడే లేడంటూ.. పొగడ్తలు కురిపించింది. ఎక్కడి వెళ్లినా మోడీని చూసేందుకు, మోడీతో కరచాలనం చేసేందుకు కూడా ప్రజలు ఎగబడ్డారు. మోడీ.. మోడీ.. అంటూ యూత్ కూడా అదే జపం చేశారు. నమో.. అనే సాస్కృతిక పదం కూడా నరేంద్ర మోడీగా మారిపోయింది.ఆయనతో మిత్ర పక్షాలుగా నాలుగేళ్లు మెలిగి, కేంద్రంలో పదవులు సైతం పంచుకున్న చంద్రబాబు పార్టీ ఇప్పుడు అదే మోడీకి వ్యతిరేకంగా కర్ణాటకలో చక్రం తిప్పుతుండడం బీజేపీ నేతలను కలవర పెడుతోంది. కేంద్రంలో మోడీ గట్టిగా ఉన్నాడని, దేశ వ్యాప్తంగా తమదే హవా అని అనుకున్న నేతలకు ఇప్పుడు అనూహ్య పరిణామాలు ఎదురుకావడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. అవిశ్వాస తీర్మానంపై మోడీ వెనకడుగు వేశారని, ఆయనకు ప్రభుత్వాన్ని నడిపే సత్తా లేదని కూడా విమర్శలు ఊపందుకున్నాయి. ఇక, ఇప్పుడు తాజాగా ఇటీవల ముగిసిన పార్లమెంటులో ప్రతిపక్షాలు చేసిన ఆందోళనలకు నిరసనగా ఒకరోజు దీక్ష చేపట్టి మరింత పలుచన య్యారు. ప్రభుత్వాన్ని నడపాల్సిన ప్రధానే నిరసలకు దిగడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావడంతో రాజకీయంగా ఇది పెను సంచలనంగా మారింది. ఏదేమైనా.. మరో ఏడాదిలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న సమయంలో ప్రధాని మోడీ వేస్తున్న రాజకీయ అడుగులు బీజేపీని పలుచన చేస్తున్నాయి. మరో పదిహేను ఇరవై రోజుల్లో కర్ణాటక ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో బీజేపీకి వేటు వేయించేలా ఆయన వ్యవహార శైలి లేదనేది కొందరి భావన.మొత్తంగా మోడీ రాజకీయంగా వేస్తున్న అడుగులు ఆయనను విజయం దిశగా కంటే.. విఫలమైన నాయకుడిగా మారుస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు.