YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

నిరాడంబరంగా రాఘవేంద్ర స్వామి సప్తరాత్సోవాలు

నిరాడంబరంగా  రాఘవేంద్ర స్వామి సప్తరాత్సోవాలు

మంత్రాలయం జూలై 28,   రాడంబరంగా  రాఘవేంద్ర స్వామి సప్తరాత్సోవాలు  నియమ నిబంధనలు అనుసరిస్తూ కారిక్రమాలు  ఉత్సవాలు భక్తులకు అనుమతి లేదు  అంతరభాగంలో ఆరాధనోత్సవాలు  స్వామి భక్తులు సహకరించాలి  
ప్రపంచ ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా ఎఫెక్ట్ తో రాఘవేంద్ర స్వామి ఉత్సవాలను ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు.  శ్రీ రాఘవేంద్రస్వామి  ఆరాధనోత్సవాలకు భక్తులకు అనుమతి లేదని అంతరభాగంలో ఆరాధనోత్సవాలు నిర్వహించాలని మఠం అధికారులకు ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్ సూచించారు. సోమవారం దుర్గా రమణ కళ్యాణ మండపంలో  ఆరాధనోత్సవాలు పై వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు..  ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో కరోనా వ్యాధి దృష్ట్యా మఠం అంతరభాగంలో  ఉత్సవాలను  జరపాలని నిర్ణయించారు.ఆగస్టు 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరుగు రాఘవేంద్రస్వామి 349 వ సప్త రాత్రోత్సవాలను  శ్రీ మఠం  అంతర్భాగంలోని 50 మంది లోపు సిబ్బందితో సంప్రదాయబద్దంగా  నిర్వహించడానికి  నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కావున దేశం నలుమూలలా ఉన్న భక్తులందరూ మంత్రాలయంకు  ఎవరు తమ సొంత వాహనాలలో కానీ ఇతర మార్గాల ద్వారా రావడం మానుకోవాలని వారి స్వస్థలం లోనే వారి ఇంట్లోనే ఉంటూ రాఘవేంద్ర స్వామి నామస్మరణ చేస్తూ స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరారు.
 ఆరాధనోత్సవాలలో జరుగు  పూజలు , ఉత్సవాలు అభిషేకాలు లాంటి. కార్యక్రమాలను శ్రీ మఠపు యూట్యూబ్ ఛానల్ అయిన మంత్రాలయ వాహిని ద్వారా భక్తులకు ఎప్పటికప్పడు ప్రత్యక్ష ప్రసారం గావింపబడును. కావున  ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి మంత్రాలయంలో   ఆరాధనోత్సవాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ కృష్ణయ్య, ఎస్ఐ లు వేణుగోపాల్ రాజ్,ఎర్రన్న,  మాధవరం ఎస్ఐ బాబు , తహశీల్దార్ చంద్రశేఖర్, ఇన్చార్జ్ .ఎంపిడిఓ రాధ,   ఈఆర్డీఓ నాగేష్ ,  ఆర్ఐ మహేష్,  మఠం ధార్మిక పర్యటన అధికారి.శ్రీ పతి, సీఆర్వో ఐపి నరసింహ స్వామి,ఇంజనీర్. సురేష్,  వైకాపా మండలాధక్ష్యుడు భీంరెడ్డి , మాజీ సర్పంచ్ భీమయ్య,  గోరకల్ కృష్ణ, కురువ  మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు

Related Posts