ఒంగోలు, జూలై 29,
ప్రకాశం జిల్లా టీడీపీ రాజకీయాలు వేడెక్కాయి. మరో వారసుడికి ఓ సీటు దాదాపు ఖరారైందన్న ప్రచారం జిల్లా రాజకీయ వర్గాల్లో కాస్త హీటు పుట్టిస్తోంది. ముఖ్యంగా ఈ జిల్లాలో సీనియర్ రాజకీయ కుటుంబం దామచర్ల ఫ్యామిలీలో యువ నాయకుడు దామచర్ల సత్య ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద ఎట్రాక్షన్‌గా మారిపోయారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న దామచర్ల జనార్దన్‌కు సత్య స్వయానా చిన్నాన్న కుమారుడు. దామచర్ల ఆంజనేయులుకు మనవడు. అయితే, ఇప్పుడు సత్య చుట్టూ పాలిటిక్స్ వేగంగా మారుతున్నాయి. పార్టీ కోసం సత్య దూకుడుగా ముందుకు వెళ్తారనే అభిప్రాయం ఉంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సత్య చాలా దూకుడుగా వ్యవహరించారు.ఇటు జిల్లా కేంద్రమైన ఒంగోలుతో పాటు దామచర్ల ఫ్యామిలీ సొంత నియోజకవర్గం అయిన కొండపి నియోజకవర్గంలో ఆయన చక్రం తిప్పారు. తర్వాత జిల్లా రాజకీయాల్లోనూ వేలు పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ విషయంలో జనార్దన్, సత్యల మధ్య గొడవలు కూడా జరిగాయని చెబుతారు. ఇదిలావుంటే, ప్రస్తుతం దర్శి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ సీటు ఖాళీ అయింది. నిన్న మొన్నటి వరకు ఇక్కడ ఉన్న మాజీ మంత్రి శిద్దా రాఘవరావు.. ఇటీవల వైఎస్సార్ సీపీలోకి చేరిపోయారు. దీంతో ఈ సీటును దామచర్ల సత్యకు కేటాయిస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు.చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే దామచర్ల సత్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో జరిగిన పలు బహిరంగ సభల్లో ఆయన సత్య పేరు ప్రస్తావిస్తూ అతడి రాజకీయ భవిష్యత్తు తాను చూసుకుంటానని చెప్పడంతో టీడీపీ కేడర్‌లో తిరుగులేని స్పందన వచ్చేది. అయితే సత్యకు సరైన ప్లాట్ ఫాం లేకుండా పోయింది. ఇక ఇప్పుడు దర్శి సీటు ఖాళీ అవ్వడంతో అక్కడ పార్టీ బాధ్యతలు సత్యకు ఇవ్వాలని కొందరు కోరుతున్నారు. అయితే, మరికొందరు మాత్రం దర్శిలో కమ్మసామాజిక వర్గానికి పెద్దగా ఓటు బ్యాంకు లేదని, అదే కందుకూరు నియోజకవర్గంలో అయితే 40 వేల పైచిలుకు ఓటు బ్యాంకు ఉందని, సో.. అక్కడినుంచి పోటీ చేస్తే బాగుంటుందని అంటున్నారు.ఈ క్రమంలోనే వారు గతంలో సత్యకు చక్కని భవిష్యత్తు కల్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చిన విషయం గుర్తు చేస్తున్నారు. దర్శిలో సత్యకు పోటీ లేకపోయినా కందుకూరులో మాజీ ఎమ్మెల్యేలు దివి శివరాం, పోతుల రామారావు ఉన్నారు. దివికి గత ఎన్నికల్లోనే సీటు ఇవ్వలేదు. పోతుల అక్కడ పాతుకుపోలేదన్న టాక్ కూడా ఉంది. మరి వీరిద్దరిని కాదని సత్యకు బాబు ఛాన్స్ ఇస్తారా ? అన్నది చూడా