YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

జంప్ చేసిన నేతల మేధోమధనం

జంప్ చేసిన నేతల మేధోమధనం

హైద్రాబాద్, జూలై 29, 
తెలుగు రాష్ట్రాల్లో ఎద‌గాలి.. జెండా పాతాలి.. అధికారంలోకి రావాలి.. అని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ.. మ‌రి ఆ క‌ల సాకారం చేసుకునే దిశ‌గా అడుగులు వేస్తోందా? కీల‌క‌మైన నాయ‌కుల‌కు పార్టీ ఊతం అందిస్తోందా ? అంటే.. లేద‌నే చెప్పాలి. మంచి ప్రజాబ‌లం ఉన్న నాయ‌కుల‌ను, స్థానికంగానే కాకుండా రాష్ట్రాల ప‌రిధిలోనూ పార్టీల వ్యూహాల్లోనూ ఆరితేరిన వారికి కూడా బీజేపీ నుంచి స‌రైన ప్రాధాన్యం ల‌భించ‌డం లేద‌నే చెప్పాలి. ఇలాంటి ప‌రిస్థితే.. తెలంగాణ‌కు చెందిన గ‌రికిపాటి మోహ‌న‌రావుకు ఎదుర‌వుతోంద‌ని పొలిటిక‌ల్ స‌ర్కిళ్లలో ప్రచారం జ‌రుగుతోంది. టీడీపీలో ఉన్న స‌మ‌యంలో ఆ పార్టీలో దూకుడుగా గ‌రికిపాటి మోహ‌న‌రావు వ్యవ‌హ‌రించారు.మ‌రీముఖ్యంగా మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర‌రావుకు వియ్యంకుడు అయిన గ‌రికిపాటి మోహ‌న‌రావు టీడీపీలో వ్యూహాత్మక నాయ‌కుడిగా గుర్తింపు సాధించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు నమ్మిన బంటుగా పని చేశారు. దీనికి ప్రతిఫలంగా రాజ్యసభ పదవిని పొందారు. గ‌త ఐదేళ్లపాటు ఆయ‌న రాజ్యస‌భ స‌భ్యుడిగా కొన‌సాగారు. ఏపీలో బాబు అధికారం కోల్పోవడం, జాతీయ స్థాయిలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇటీవ‌ల టీడీపీకి చెందిన‌ న‌లుగురు రాజ్యస‌భ స‌భ్యులు.. సుజ‌నాచౌద‌రి, సీఎం ర‌మేష్‌ల‌తో పాటు.. ఈయ‌న కూడా బీజేపీ కండువా క‌ప్పుకొన్నారు. అయితే, వారిలా కాకుండా.. ఈయ‌న కొంత ప్రత్యేకత చూపించారు.హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న త‌న అనుచరులు, టీడీపీకి చెందిన వివిధ జిల్లాల అధ్యక్షులు, దాదాపు 10 వేల మందితో నాంపల్లి సభ వేదికగా బీజేపీ నేత నడ్డా సమక్షంలో క‌మ‌లం గూటిలోకి గ‌రికిపాటి మోహ‌న‌రావు ప్రవేశించారు. తెలంగాణ‌లో క‌మ్మ సామాజిక వ‌ర్గంలో కొంద‌రు కీల‌క నేత‌ల‌ను కూడా ఆయ‌న త‌న‌తో పాటు బీజేపీలోకి తీసుకువెళ్లారు. మ‌రి ఇంత బ‌లం బ‌ల‌గం ఉన్న నాయ‌కుడికి పార్టీలో గుర్తింపు లేదా? అంటే.. చేరే స‌మ‌యంలో మ‌ళ్లీ రాజ్యస‌భ‌కు పంపిస్తామ‌ని క‌మ‌ల‌నాథులు హామీ ఇచ్చారు. దీంతో గ‌రికిపాటి మోహ‌న‌రావు లొట్టలేసుకుని మ‌రీ పార్టీ మారారు.అయితే, ఆయ‌న రాజ్యస‌భ స‌భ్యత్వం ముగిసిపోయి మూడు మాసాలైనా ఇప్పటి వ‌ర‌కు ఆయ‌న‌ను క‌మ‌ల నాథులు ప‌ల‌క‌రించింది లేదు. పైగా ఇప్పట్లో ఈ ప‌ద‌వి ద‌క్కుతుంద‌నే ఆశ కూడా లేదు. ఎందుకంటే.. త‌మ‌కు అత్యంత స‌న్నిహితులైన ప‌రిమ‌ళ్ న‌త్వానీ వంటి వారికే త‌మ వ‌ద్ద టికెట్ లేక .. ఏపీ సీఎం జ‌గ‌న్ వ‌ద్ద తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో గ‌రికిపాటి మోహ‌న‌రావు వంటి వారికి అవ‌కాశం ద‌క్కడం ఇప్పట్లో సాధ్యమ‌య్యేది కాదు. ఈ నేప‌థ్యంలో అటు తుమ్మల నాగేశ్వ‌ర‌రావు, ఇటు గ‌రికిపాటి మోహ‌న్‌రావులు కూడా టీడీపీలో సంపాయించుకున్న హ‌వా పార్టీలు మారిన త‌ర్వాత కొన‌సాగించ‌లేక పోతున్నార‌నే చ‌ర్చలు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం

Related Posts