YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

తమిళనాడులో డేంజర్ బెల్స్

 తమిళనాడులో డేంజర్ బెల్స్

చెన్నై, జూలై 29, 
తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే రెండు లక్షల వరకూ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజుకు ఐదు వేల కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. తమిళనాడు నుంచి వచ్చే వారిని ఇతర రాష్ట్రాల వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వచ్చే తమిళనాడు వాసులు విధిగా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండేలా అన్ని రాష్ట్రాలు దాదాపు నిబంధనలు విధించేశాయి.తమిళనాడులో తొలి నుంచి కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. మహారాష్ట్ర తర్వాత దేశంలో అత్యధికంగా నమోదవుతున్న కేసులు తమిళనాడులోనే ఉన్నాయి. మర్కజ్ మసీదు నుంచి వచ్చిన వారిని గుర్తించడంలో తొలినాళ్లలో ప్రభుత్వం విఫలమవ్వడతో కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత కోయంబేడు మార్కెట్ నుంచి కరోనా వైరస్ తమిళనాడు లోని అన్ని జిల్లాలకు, పట్టణాలకు వ్యాప్తి చెందింది.ఇక చెన్నై నగరాన్ని తీసుకుంటే ఇక్కడ వ్యాధి ఎక్కువగా ఉంది. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత కేసుల సంఖ్యమరింత ఎక్కవవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. చెన్నై నగరంతో పాటు వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తమిళనాడు ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించినా కేసుల సంఖ్య ఆగడం లేదు. ఒక్క చెన్నై నగరంలోనే దాదాపు 85 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది.దీంతో చెన్నై నగరం దాదాపు ఖాళీ అయిందనే చెప్పాలి. దీంతో పాటు డీఎంకే ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా కరోనా సోకడం భయభ్రాంతులకు గురి చేస్తుంది. కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమయిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే తమిళనాడులో కరోనా పరీక్షలు ఎకకువా నిర్వహిస్తున్నారు. దాదాపు 21 లక్షల మందికి తమిళనాడులో పరీక్షలు నిర్వహించారు. అందువల్లనే కేసుల సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.

Related Posts