YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఇంకెప్పుడు.. కొత్త బాస్

ఇంకెప్పుడు.. కొత్త బాస్

హైద్రాబాద్, జూలై 29, 
అన్ని పార్టీలు వాయువేగంతో నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాల అధ్యక్షులను మార్చేస్తుంటే..100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా సాగదీస్తూనే ఉంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని మార్చడానికి మల్లగుల్లాలు పడుతోంది. తెలంగాణ ముందస్తు ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ అధ్యక్షుడి మార్పు జరుగుతుందని భావించినా అది ఇప్పటికే నెరవేరలేదు.ఇన్నాళ్లు రేవంత్ రెడ్డికి ఖాయం అనుకున్న తెలంగాణ పీసీసీ పీఠంపైకి తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో కనుమరుగైన సీనియర్ నేత పేరు తెరపైకి వస్తోంది. రేవంత్ కు చెక్ పెట్టేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు ఆమోదించారట.. సోనియా కూడా ఆ సీనియర్ కు పీసీసీ చీఫ్ ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.తెలంగాణ సీఎం కేసీఆర్ కు ధీటైన ప్రత్యర్థి రేవంత్ రెడ్డినే అంటారు. ఆయనతో మాటలు ప్రచారంలో రేవంత్ ధీటుగా ఉంటాడు. కానీ కేసీఆర్ ఎత్తుల ముందు రేవంత్ నిలువలేక పోతున్నారు. దీంతో కేసీఆర్ ఎంతో గౌరవించే పెద్దలు జానారెడ్డినే పీసీసీ రేసులో నిలబెట్టారు. తాజాగా కాంగ్రెస్ నేతల మూకుమ్మడి ప్రతిపాదన మేరకు జానారెడ్డిని పీసీసీ చీఫ్ గా చేస్తే ఎలా ఉంటుందని సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ అధిష్టానం సమాలోచనలు చేస్తోందని ప్రచారం సాగుతోంది. దశాబ్ధాలుగా కాంగ్రెస్ నే నమ్ముకొని ఉంటున్న జానాకు పార్టీ పగ్గాలు అప్పజెప్పడం మంచి నిర్ణయం అని అంటున్నారు.
దూకుడుకు పర్యాయపదమైన రేవంత్ రెడ్డి చుట్టూ వివాదాలున్నాయి. ఓటుకు నోటు కేసులో వీడియో సాక్ష్యం ఉంది. ఇక చాలా ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ కు ఇస్తే మొదటికే మోసమని సోనియాకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారట.. అదే పెద్దలు జానారెడ్డికి ఇస్తే ఎవరికీ అసమ్మతి ఉండదని చెప్పారట.. దీనికి రేవంత్ సైతం ఓకే అంటారని.. కేసీఆర్ సైతం గౌరవిస్తారని సూచించారని సమాచారం. దీంతో పెద్దలు జానారెడ్డి అయితే బెటర్ అని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

Related Posts