YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

అందరీకి ప్రమోషన్...కానీ...

అందరీకి ప్రమోషన్...కానీ...

హైద్రాబాద్,  జూలై 29, 
కరోనా సంక్షోభం సందర్భంగా యూజీ, పీజీ, బీటెక్‌ తదితర విద్యార్థుల్లో ఒక్క ఫైనలియర్‌ వాళ్లను మినహా మిగతా వారందరినీ పరీక్షలు లేకుండానే ప్రమోట్‌ చేస్తున్నట్లు వర్సిటీలు, విద్యా సంస్థలు ప్రకటించాయి. విద్యార్థులందరూ సంతోషపడ్డారు. ఇదే సమయంలో మిగిలిన సంవత్సరాలకు సంబంధించిన పరీక్షలు ఉంటాయా? అన్న విషయంలో సందిగ్ధత నెలకొంది.ప్రస్తుతానికి ఎలాంటి పరీక్షలు లేకుండా కోర్సుల వారీగా విద్యార్థులంతా ప్రమోట్‌ అవుతారు. కానీ వీరంతా తర్వాత పరీక్షలు రాయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు మినహా, మిగిలిన సంవత్సరాల విద్యార్థులు పైతరగతులకు ప్రమోట్‌ అవుతారు. కానీ తర్వాత సెమిస్టర్‌ ప్రారంభించాక అంతకుముందు ఏడాదికి సంబంధించిన పరీక్షలు రాయాల్సి ఉంటుంది. నవంబరు లేదా డిసెంబరులో వాటిని నిర్వహించే వీలుంది.విద్యార్థులు పరీక్షలు లేకుండా నేరుగా పైతరగతులకు ప్రమోట్‌ అవుతున్నారు కాబట్టి ఈసారికి వర్సిటీల పరిధిలో క్రెడిట్‌ డిటెన్షన్‌ ఉండదు. జేఎన్‌టీయూ, ఉస్మానియా పరిధిలో అన్ని సంవత్సరాల వారికి దీన్ని వర్తింపజేయనున్నారు.దీనివల్ల విద్యార్థులకు ఎంతో ఊరట లభించనుంది. తర్వాత నిర్వహించే పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణులు కాకపోయినా ప్రభావం ఉండదు. అదే తరగతిలో కొనసాగుతారు. కాకపోతే బ్యాక్‌లాగ్స్‌ను కోర్సు అయ్యేలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విషయాల్నింటిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related Posts