న్యూఢిల్లీ, జూలై 29,
ప్రస్తుత పార్లమెంట్ భవనం పురాతనమైందని, దాన్ని కూల్చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ప్రస్తుత పార్లమెంట్ భవనం వంద ఏళ్ల పురాతన భవనమని, భద్రతా పరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా ఏవైనా తీవ్రమైన అగ్ని ప్రమాదాలు సంభవిస్తే కూడా కష్టమేనని ఆ అఫిడవిట్లో తెలిపింది. అందుకే ఇదే స్థలంలో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తామని కేంద్రం ‘‘ఈ భవనాన్ని 1921 లో భవన నిర్మాణం ప్రారంభమై... 1937 లో ముగిసింది. ఇప్పటికి దాదాపు వందేళ్లు గడిచాయి. ఇప్పటికే ఇందులో చాలా సమావేశాలు జరిగాయి. కాబట్టి.. ప్రస్తుత అవసరాలకు, సాంకేతికతకు ఈ భవనం సరిపోదు’’ అని కేంద్రం పేర్కొంది