YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

బీజేపీలో అంతర్మధనం... చంద్రబాబుతో వైరంపై సంఘ్ క్లాస్

 బీజేపీలో అంతర్మధనం... చంద్రబాబుతో వైరంపై సంఘ్ క్లాస్

ఢిల్లీ నడిబొడ్డులో మోడీని చంద్రబాబు కడిగివేసిన వీడియోలు ఇప్పుడు బిజెపి నేతలకు నిద్రలేకుండా చేస్తున్నాయట. అసలు చంద్రబాబుతో వైరం దేనికి? బాబుతో వైరం తెచ్చుకున్నా మధ్యలో అయినా రాజీ చేసుకుంటే పోయేది కదా? అంటే ఔననే సమాధానమే వస్తోంది.ఎక్కడ పొరపాట్లు జరిగాయో సమీక్షించుకోంటుంది కమలం పార్టీ.  భవిష్యత్ లో  పరాజయాలు ఎదురుకాకుండా.. చర్యలకు రెడీ అవుతోంది. మోడీ, అమిత్ షా వైఖరి పట్ల.. అద్వానీ లాంటి సీనియర్లు.. అసంతృప్తి వ్యక్తం చేయడంతో..పునరాలోచనలో పడింది.  ప్రస్తుతం పార్టీలో గ్రామస్థాయి నుంచి స్టేట్ లెవల్ వరకు అంతర్గత ఎన్నికలు జరుగుతున్నాయి. చంద్రబాబునాయుడుతో వైరం పెట్టుకుని జాతీయ స్థాయిలో పరువు తీసుకున్న తర్వాత ఆర్ ఎస్ ఎస్  రంగం లోకి దిగాక కాని తత్త్వం బోధ పడలేదట. అనవసరం గా తెగే వరకు లాగటం దేనికి అని సంఘ్ పెద్దలు క్లాస్ తీసారట. ఇప్పుడు జాతీయ స్థాయిలో పరువు పోయిందని, దీనివల్ల బిజెపికి దేశ స్థాయి లో నష్టం జరిగిందని చెప్పారు. చంద్రబాబు నాలుగుమెట్లు పైకి ఎకబాగి దేశస్థాయిలో మోడీకి తానే సరైన ప్రత్యర్థిని అని రుజవు చేసుకున్నారు. ఇదంతా మోడీ చేజేతులారా చేసుకున్నది కాదా అని ప్రస్నిన్చారట. చంద్రబాబుతో సామరస్యంగా వ్యవహరిస్తే ఆయన చాలా ఉదారంగా ఉండేవారని అదే సమయంలో ఆంధ్రాకు ఇచ్చిన హామీల్లో కొన్నిటినైనా నెరవేర్చి ఉంటే చంద్రబాబు సంతోషంగా మోడీతోనే సర్దుకుపోయేవారని వ్యాఖ్యానించారు. అసలు ఏమీ చేయకుండానే చంద్రబాబును అదుపులో పెట్టుకోవాలన్న ఆతృతే మోడీ కొంప ముంచిందని ఆయన అన్నారు. ఆరు నెలలకో సంవత్సరానికో ఒకసారి ఆంధ్రా రాజధాని అమరావతిలో పర్యటించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి నిధుల గురించి చెప్పి ప్రజలను ఆకట్టుకుని ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని అన్నారట.చంద్రబాబు ఢిల్లీలో ప్రదర్శించిన వీడియోలు దేశవ్యాప్తం గా చర్చనీయం అయ్యి మోడీ విశ్వసనీయతకి, బిజెపికి దెబ్బ పడింది అని చెప్పారట.ఎప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు తన పదవికి ఎసరు తెస్తారనే ఆలోచన వల్లే బాబుతో మోడీ వైరం కొని తెచ్చుకున్నారని ఆర్‌ ఎస్ ఎస్  వర్గాలు విశ్లేషించాయి. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తిలేదని చంద్రబాబు పదే పదే చెప్పినా ప్రధాని మోడీ పట్ల సంపూర్ణ విధేయత చూపినా మోడీకి ఉన్న అనుమానమే ఇప్పటి పరిస్థితికి కారణం అని వారు ఖచ్చితంగా చెప్పారట.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబును తొక్కివేస్తే తనకు జాతీయ స్థాయిలో ఎదురే లేకుండా ఉంటుందన్న ఆలోచనే చంద్రబాబుతో వైరానికి మోడీని ఉసిగొల్పిందనే మాట వినిపిస్తోంది. వివిధ ఆర్థిక నేరాలతో సంబంధాలు ఉన్న ఎంపి విజయసాయిరెడ్డిని దగ్గరకు తీసి చంద్రబాబుపై ఉసిగొల్పి ఆయన పరువు తీయాలని ప్రయత్నం చేసినా అవి ఫలించకపోగా ఆ అవినీతి బిజెపి కి అంటుకుందని చెప్పారట. చివరకు పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాసం పెట్టె దాకా లాగటం ఓకే తప్పు అయితే, సమాధానం చెప్పలేక పారిపోవాల్సిన పరిస్థితి రావటం కావాలని చేసుకున్నదే అని చెప్పారట. రాజధాని అమరావతికి సహాయం చేసి తన పేరును చరిత్రలో నిలిచిపోయే అవకాశాన్ని చేజేతులారా పోగొట్టుకున్నారని ఇప్పుడు కాకపోయినా రేపైనా చంద్రబాబు రాజధాని నిర్మిస్తారని ఆ రాజధానిలో మాత్రం మోడీ పేరు ఉండదని ఐదేళ్లు ప్రధానిగా ఉన్న వ్యక్తి చంద్రబాబుతో వైరం పెట్టుకోకపోయి ఉండే మరో ఐదేళ్లు ప్రధానిగా ఉండేవారని కానీ అనవసర అహంభావం, అసూయతో వచ్చిన అవకాశాన్ని మోడీ చేజేతులారా పాడు చేసుకున్నారని, కేవలం మోడీ షా తప్పుల వల్ల దేశ వ్యాప్తం గా కాంగ్రెస్ బలోపేతం అవుతుందని ఘంటా పధం గా చెప్పారట. ఊహించని ఈ షాక్ తో ఆలోచనలో పడ్డ మోడీ అనవసరం గా చంద్రబాబు తో పెట్టుకున్నాం అని మధనపడుతున్నారని సమాచారం. మరో వైపు ధారణంగా బీజేపీ వ్యవహారాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం ఉంటుంది కానీ… ఆర్ఎస్ఎస్ వ్యవహారాల్లో మాత్రం బీజేపీ జోక్యం పెద్దగా ఉండదు. ఆర్ఎస్ఎస్ మార్గదర్శకాలను బీజేపీ పెద్దలు పాటిస్తుంటారు. కానీ ప్రస్తుతం బీజేపీని పూర్తిగా అధీనంలోకి తెచ్చుకున్న నరేంద్రమోదీ… మెల్లిమెల్లిగా ఆర్ఎస్ఎస్ ను కూడా తన అధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా ఉండటం ఆర్ఎస్ఎస్ వర్గాలకు ఏ మాత్రం ఇష్టంలేదు. కానీ మోదీ ఒత్తిడి కారణంగానే అమిత్ షా ఆ పదవిలో కొనసాగుతున్నారు. అయితే ఎప్పటికైనా ఆర్ఎస్ఎస్ కారణంగా తన పదవికి ముప్పు ఉంటుందని భయపడుతున్న నరేంద్రమోదీ ఆర్ఎస్ఎస్ లోని కీలక పదవుల్లోనూ తనకు అనుకూలంగా ఉండే వ్యక్తి ఉండాలని కోరుకుంటున్నారని… ఆ దిశగా ఆయన ప్రయత్నాలు కూడా చేశారని ఆర్ఎస్ఎస్ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి.

Related Posts