శ్రావణ మాసం నుండి , సంక్రాంతి వరకు మా ఇంట్లో పారిజాత పండగే .
పొద్దునే లోపల వైపు ,చెట్టుని కొంచం తాకి తే చాలు జలజల
రాలే పూలని చూస్తూ ఆ పరిమళం ఆస్వాదిస్తూ , ఒక్కొక్క పువ్వు ఏరుకుంటూ, బుట్ట నిండినా కూడా మళ్ళీ ఇంకోటి తెచ్చి మేము, నాన్నగారు ఆ తొలి పొద్దు లో ఆపూల ప్రత్యేక సుగంధం తో అనుభవించే ఆనందం . వర్ణనాతీతం.
ఒకవైపు ఐతే ఆపూలన్నీ నీళ్లలో తీసి , దండలు గుచ్చి, దైవానికి అలంకరించి , అష్టోత్తరం ,సహస్రనామం కి సరిపోతాయని సంతోషం తో అమ్మ, పండగే కదా.
ఇక గోడ బయట పూజకు,వైద్యానికి అంటూ రాత్రే పాత చీరలు గోడ పక్కగా పరచి ,ఎంతమందో పారిజాత పూలన్నీ విరిసే ప్రభూ నీకోసం .
ఈ పూలు తెల్లని రేకలు ఆరంజ్ కాడ తో సుకుమారంగా ఒక గ్రేస్ తో ఉంటాయి . దండ గుచ్చడానికి కూడా అనువుగా ఉండి ,ముత్యాలు ,పగడాలు కలగలిపి నట్టు చాలా బావుంటాయి వినాయకచవితి కి దసరాకి పొడవుగా వరుసలు గా దండలు గుచ్చి మండపాలలో ఇచ్చివచ్చే వాళ్లం.
పూల తో పాటు చెట్టే ఒక కల్పవృక్షం . ప్రతిభాగం వైద్య పరంగా ఉపయోగపడుతుంది ప్యూర్
మెడిసినల్ ప్లాంట్ .
శ్రీకృష్ణ పారిజాతం అందరికీ తెలిసిందే కదా . శ్రీకృష్ణుడు స్వర్గం నుండి తెచ్చిన చెట్టు ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ ,బారంకి జిల్లా కెంటూర్ లో ఉందంట
చాలా పురాణాలలో ఈ చెట్టు ప్రస్తావన ఉంది
Sad tree in day time అని అంటారు .పగలు పూట పూలన్నీ రాల్చేసి ,
వాడిపోయిన రంగులో ఉన్న ఆకుల్ని కలిగి రాత్రి ఉన్న అద్భుతమైన అందాన్ని సువాసనను కోల్పోయి ఉంటుందని ..
హంగు అంతా రాత్రి, తెల్లవారుఝామున మాత్రమే కదా అందుకే.
పూలు కూడా చెట్టు ను బట్టి రకరకాల అమరికలో ఉంటాయి.
నేను నాలుగు రకాలైన అమరిక లో ఉన్న పూలు పెట్టాను.
"నీరు తాకినా వడలి పోయే పూలు అతి సున్నితం, అత్యంత అందం ,అపరిమితమైన గంధం , మరెంతో ఆహ్లాదకరం' పారిజాతాలు..