YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆర్ ఆండ్ బీ మంత్రిగా మాలగుండ్ల పదవీ స్వీకారం

ఆర్ ఆండ్ బీ మంత్రిగా మాలగుండ్ల పదవీ స్వీకారం

అమరావతి జూలై 29 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు,  భవనాల శాఖ మంత్రిగా మాలగుండ్ల శంకరనారాయణ  పదవీ స్వీకారం చేశారు. బుధవారం, అమరావతి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం  మాలగుండ్ల శంకరనారాయణ గారు రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మాత్యులుగా పగ్గాలు అందుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తూర్పు గోదావరి జిల్లాలోని యెదురులంక - జి. మూల్లపాలెం రహదారికి 10/140 కీ.మీ.లో అక్షరాల 76.90 కోట్ల రూపాయల వ్యయంతో, జ.మూల్లపాలెం వద్ద గోదావరి నది, వృధ్ధ గౌతమి బ్రాంచ్ కెనాల్ మీదుగా కొత్త వంతెన నిర్మాణ పనులకు మొదటి సంతకం చేశారు. రానున్న రెండేళ్ళలో ఈ వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Related Posts