నెల్లూరు జూలై 29
జర్నలిస్టులకు స్థానిక రైల్వే స్టేషన్ వద్ద కరోనా పరీక్షలు నిర్వహించడ అభినందనీయమన ఎపియుడబ్లూజె రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ అన్నారు ..బుధవారం జాయింట్ కలెక్టర్ లు వినోద్ కుమార్ , ప్రభాకరరెడ్డి, ఆర్డీఓ హుసేన్ సాహెబ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు .ఈసి మెంబర్ నయీం ఖాన్ ఈ కార్యక్రమాన్ని కి సంధానకర్తగా వ్యవహరించారన్నారు .చాలా మంది జర్నలిస్టులు తమ పేర్లను ప్రెస్‌క్లబ్‌లో ఇచ్చి కూడా కరోనా పరీక్షలకు రాకపోవడం ఆవేదన కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు .జే.సీ ప్రభాకరెడ్డి , వినోద్ కుమార్, ఆర్ డి ఓ హుస్సేన్ సాహెబ్, జర్నలిస్టులకు ఎలాంటి సాయమైనా చేస్తానని తెలియజేయడం అభినందనీయమని అన్నారు .పరీక్షలు చేసుకొని జర్నలిస్టు మిత్రులంతా త్వరగా పరీక్షలు చేసుకోవాలని ఆయన కోరారు .ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులు ప్రతి ఒక్కరి తెలుసని దీనిపై అశ్రద్ధ వహించకుంచడా తక్షణమే ప్రతి ఒక్కరు కూడా పరీక్షలు చేసుకుని తాము తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలోడాక్టర్ యశ్వంత్ కుమార్, ఇసి మెంబర్ నయీంఖాన్, సీనియర్ జర్నలిస్టు భగవాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు .
హెల్త్ సూపర్ వైజర్, షేక్ హిదయతుల్లా, ల్యాబ్ టెక్నిషియన్ రాజేష్ ,హెల్త్ అసిస్టెంట్లు శ్రీనివాస్ రెడ్డి, జయచంద్ర ,సామ్నా గౌరవాధ్యక్షుడు జి. శేఖర్ బాబు, పలువురు సీనియర్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు