ఏలూరు, జూలై 29
వన్యప్రాణులు, పులుల ఆవస్యకత, వాటి అలవాట్ల పై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఫారెస్టు అధికారులకు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు సూచించారు. బుధవారం ఏలూరు కలెక్టరేట్ లోని ఆయన చాంబర్ లో ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా పోస్టర్ ను కలెక్టర్ విడుదలచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పులులు అంతరించిపోకుండా కాపాడుకోవలసిన అవసరం ఉందన్నారు. వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఎఫ్ఒ ఆర్ . యశోదాబాయ్, ఏలూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్వికె కుమార్ , డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కె .సత్యనారాయణరాజు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎస్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.