YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వడివడిగా అయోధ్య అడుగులు

వడివడిగా అయోధ్య అడుగులు

లక్నో, జూలై 30
కోట్లాది హిందువుల ఆకాంక్ష అయోధ్యలో రామమందిరం దశాబ్దాలుగా ఈ ఆలయ నిర్మాణంపై రగడ జరిగింది. ఇక ఈ విషయంపై గతేడాది సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. రాముడు పుట్టిన ప్రాంతంలోనే రామమందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఆగష్టు 5 న దేవాలయ నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ తోపాటు మరికొందరు అతిధులు హాజరవుతున్నట్లు సమాచారం.ఇక ఈ నేపథ్యంలోనే శంకుస్థాపనకు సంబందించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దేవాలయ పునాదిలో 22 కేజీల 600 గ్రాముల వెండి ఇటుకలు ఉపయోగించనున్నారు. వెండి ఇటుకపై ఇలా రాశారు. ఈ పునాది రాయిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ… ఆగస్టు 5న మధ్యాహనం 12 గంటల 15 నిమిషాల 15 సెకండ్లకు వేస్తారు అని రాశారు.కాగా మరో వైపు సెక్యూలరిస్టులు మోడీ రామమందిర శంకుస్థాపనకు వెళ్లోద్దని వారిస్తున్నారు. అది మతపరమైన కార్యక్రమం అని విమర్శలు గుప్పిస్తున్నారు. సెక్యూలర్ దేశంలో ఇటువంటి కార్యకలాపాలకు హాజరవడం ప్రజాస్వామ్య విరుద్ధమని
అంటున్నారు. ఇక దీనిపై బీజేపీ నేతలు పెద్దగా స్పందించడం లేదు.

Related Posts