YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

రిజర్వాయర్ లలో పడిపోతున్న నీటి నిల్వలు

 రిజర్వాయర్ లలో  పడిపోతున్న నీటి నిల్వలు

భారత దేశంలో తాగునీటికి కటకట ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నాయి. ఉపగ్రహాలు పంపిన చిత్రాల ఆధారంగా అమెరికాకు చెందిన నీటి వనరుల సంస్థ  ప్రపంచవ్యాప్తంగా నీటి కొరతపై అధ్యయనం జరిపింది.  దక్షిణాఫ్రికాలో వరుసగా మూడేండ్లుగా కరువు పరిస్థితులు ఏర్పడటంతో ఆ దేశంలోని లక్షల మంది ప్రజలు తాగునీటి కోస అల్లాడుతున్నారు. ఇటీవలే కేప్‌టౌన్‌లో తాగునీటి కొరత ఉన్నదని అధికారికంగా ప్రకటించారు. భారతదేశంతోపాటు దక్షిణాఫ్రికా, మొరాకో, ఇరాక్, స్పెయిన్ తదితర దేశాల్లో తీవ్రమైన తాగునీటి కొరత పరిస్థితులు తలెత్తాయి. నీటి వినియోగంలో నిర్లక్ష్యం, వృథాగా నీటిని వదిలేయడం.. భారతదేశంలోని రిజర్వాయర్లు, డ్యామ్‌లు పూర్తిగా అడుగంటడంతోపాటు భూతాపం పెరుగుదలకు కారణమవుతున్నదన్న విమర్శ వినిపిస్తున్నది. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల మధ్య ప్రవహిస్తున్న నర్మదా నదిపై నిర్మించిన రెండు రిజర్వాయర్ల నుంచి నీటి కేటాయింపుల తీరుపై ఆయా రాష్ర్టాల ప్రజల మధ్య ఉద్రిక్తతలు తలెత్తే ముప్పు పొంచి ఉన్నదని ఈ అధ్యయనం హెచ్చరించింది. గుజరాత్‌లో నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యామ్ దిగువన నీటి నిల్వలు పడిపోవడంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీని పరిధిలోని మూడు కోట్ల మందికి పైగా ప్రజలకు తాగునీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. సర్దార్ సరోవర్ డ్యామ్ పరిధిలోని రైతులంతా పంటలు సాగు చేయొద్దని కోరిన గుజరాత్ ప్రభుత్వం.. గత నెలలో సాగునీటి సరఫరాను నిలిపివేసింది. వర్షాభావ పరిస్థితులతో మధ్యప్రదేశ్‌లోని ఇందిరాసాగర్ డ్యామ్‌లో నీటి నిల్వలు సీజనల్ స్థాయి కంటే తక్కువగా ఉన్నాయి.మూడేండ్లుగా నెలకొన్న వర్షాభావంతో మొరాకోలో గల రెండో అతిపెద్ద రిజర్వాయర్ అల్ మాస్సిరా రిజర్వాయర్‌లో నీటి నిల్వలు 60 శాతానికి పైగా తగ్గిపోయాయి. అల్ మస్సిరా రిజర్వాయర్ పొరుగున ఉన్న కాసాబ్లాంకా వంటి నగరాల పరిధిలో పంటల సాగు విస్తీర్ణం పెంచడం కూడా ఈ దుస్థితి కారణాల్లో ఒకటి. మరోవైపు ఐదేండ్లుగా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న స్పెయిన్‌లోని బెండి యా డ్యామ్‌లో 60 శాతం నీటి నిల్వలు తగ్గాయి. తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఇరాక్‌లోని మోసుల్ డ్యామ్ 1990 నాటి నీటి నిల్వలతో పోలిస్తే 60 శాతం నీటినిల్వలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు మెరుగైన నీటి నిర్వహణ యాజమాన్య పద్ధతులను అమలు పరుచాలని, అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల రిజర్వాయర్లలో నీటి నిల్వలు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. 

Related Posts