YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నల్లారి కిషోర్ లక్కీ

నల్లారి కిషోర్ లక్కీ

నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి. ఐదు నెలల ముందే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడైన కిషోర్ కుమార్ రెడ్డికి చంద్రబాబు కేబినెట్ ర్యాంక్ పోస్ట్ ఇచ్చేశారు.. మూడేళ్ళుగా నల్లారి సోదరులు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్, వైసీపీలలో చేరుతారనే పుకార్లు షికార్లు చేశాయి. పార్టీలో చేరిన వెంటనే ఆయనకు ఆ హోదా ఇవ్వడానికి కారణాలేంటి? నల్లారి మీద అంత ప్రేమ ఎందుకు వచ్చింది? అంటే కేవలం ప్రత్యర్థికి చెక్ పెట్టేందుకే నల్లారికి కేబినెట్ ర్యాంకు పదవి ఇచ్చారన్న టాక్ బలంగా విన్పిస్తోంది. నల్లారి కుటుంబానికి చిత్తూరు జిల్లాలో పట్టు ఉండటంతో చంద్రబాబు ఏమీ ఆలోచించకుండా పార్టీలో చేర్చుకున్నారు. అంతేకాదు కొందరు వ్యతిరేకించినా వారికి నచ్చజెప్పి మరీ కండువా కప్పేసిన చంద్రబాబు ఐదు నెలలు తిరగక ముందే కేబినెట్ ర్యాంకు ఉన్న పదవిని కట్టబెట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే చంద్రబాబు ముందుచూపుతోనే ఈ పదవి నల్లారికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకునే నల్లారికి ఈ పదవి బాబు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికే నల్లారి రాకతో పార్టీ బలం పెరిగిందని చంద్రబాబు భావిస్తున్నారు.ఇటీవల నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయడంలో భాగంగా పీలేరుకు చెందిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పోస్టు ఇచ్చేశారు. ఇది కేబినెట్ ర్యాంకు పదవి.గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో ప్రత్యర్థి పార్టీ వైసీపీకే ఎక్కువ స్థానాలు దక్కాయి. దీంతో వచ్చే ఎన్నికలలో ఎలాగైనా చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన. ఈ మేరకే ఐదు నెలల క్రితం తనకు చిరకాల ప్రత్యర్థి అయిన నల్లారి కుటుంబంలోని వ్యక్తికి పసుపు కండువా కప్పేశారు. ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తారు.వచ్చే ఎన్నికల్లో పీలేరు టిక్కెట్ తో పాటు రాజంపేట పార్లమెంటు స్థానం కూడా నల్లారి కుటుంబానికే ఇవ్వాలని చంద్రబాబు దాదాపుగా డిసైడ్ అయ్యారు. పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి కుటుంబానికి పట్టుంది. అదే సమయంలో నల్లారి కుటుంబానికి కూడా ఓటు బ్యాంకు ఉంది. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరిన తర్వాత పీలేరు నియోజకవర్గంలో సమీక్షలు చేస్తున్నారు. దీనిపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నల్లారి సమీక్షలకు హాజరవుతున్న అధికారులపై స్పీకర్ కు కూడా వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో నల్లారికి ఇబ్బంది ఉండకూడదనే ఈ పదవి బాబు కట్టబెట్టారన్న టాక్ చిత్తూరు జిల్లాలో నడుస్తుంది. మొత్తం మీద పార్టీలోచేరిన ఐదు నెలల్లోనే నల్లారి కేబినెట్ ర్యాంకున్న పదవిని కొట్టేయడం లక్కే కదూ…

Related Posts