YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆస్కార్ పై పెరుగుతున్న ప్రకంపనలు

ఆస్కార్ పై పెరుగుతున్న  ప్రకంపనలు

న్యూఢిల్లీ, జూలై 30, 
బాలీవుడ్‌లో తనకు అవకాశాలు రానివ్వకుండా ఒక గ్యాంగ్ పనికట్టుకుని కుట్ర చేసిందని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రకటించి 24 గంటలు కాకముందే రహమాన్‌కు వంతపలుకుతూ బాలీవుడ్‌ పాక్షికతను తప్పుపట్టారు  ఒక సౌండ్ డిజైనర్. బాలీవుడ్‌లో పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు ఏదో ఒకరంగంలో ఆస్కార్ గెల్చుకుంటే అంతకు మించిన శాపం మరొకటి లేదని సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి వ్యాఖ్యానించారు. బంధుప్రీతికి, స్టార్ల పిల్లల పట్ల మొగ్గు చూపడానికి బాలీవుడ్ పేరుమోసిందని, ఎలాంటి ఆధారం లేకుండా హిదీ చిత్రసీమలో అడుగుపెడుతున్న వారికి నరకం చూపస్తున్నారని ఆరోపిస్తూ బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది. తాజాగా రెహమాన్‌తో పాటు సాంకేతిక నిపుణులు కూడా ఇలా ఆరోపణలు గుప్పిస్తుండటంతో బాలీవుడ్ ప్రముఖులు బోనులో నిలబడాల్సింనంత పనవుతోంది.ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ నిపుణులకు ఆస్కార్ రావడం పెద్ద శాపం అని సౌండ్ డిజైనర్ రెసూల్ పూకుట్టి ఆవేదన వ్యక్తం చేసారు. ‘‘ఆస్కార్‌  గెలిచిన తర్వాత బాలీవుడ్‌ నన్ను దూరం పెట్టింది. ఎవ్వరూ అవకాశాలు ఇవ్వకపోవడంతో మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాను’’ అన్నారు రెసూల్‌. ఇటీవలే సంగీత దర్శకుడు రెహమాన్‌ హిందీలో తనకు సినిమాలు రానీయకుండా ఓ గ్యాంగ్‌ పని చేస్తోందని పేర్కొన్న సంగతి తెలిసిందే. నాకూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది అని తెలిపారు రెసూల్‌.ఈ విషయాన్ని ట్వీటర్‌‌లో ప్రస్తావిస్తూ – ‘‘ఆస్కార్‌ విజయం తర్వాత బాలీవుడ్‌ వారు సినిమాలు ఇవ్వకపోయినా ప్రాంతీయ సినిమా నన్ను బాగా గౌరవించింది.. హిందీలో కొన్ని నిర్మాణ సంస్థలు ‘నా ముఖం మీదే నువ్వు మాకు అవసరం లేదు’ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు అని హాలీవుడ్‌‌‌కి వెళ్లిపోయి ఉండొచ్చు. కానీ వెళ్లలేదు, వెళ్లే ఆలోచన కూడా లేదు. నాకు ఆస్కార్‌ తెచ్చిపెట్టింది ఇండియన్‌ సినిమాన అని చెప్పుకొచ్చారు రెసూల్.అవకాశాలు రాని విషయం గురించి ఓ సందర్భంలో ఆస్కార్‌ అకాడమీ వాళ్లతో మాట్లాడితే ఆస్కార్‌ పొందినవారికి ఎదురయ్యే సమస్య ఇదే అని, ఇది ఆస్కార్‌ శాపమని చెప్పారు. అయినా ఆస్కార్‌ గెలిచి గాల్లో తేలుతూ ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా రిజెక్ట్‌ చేయడాన్ని మించిన రియాలిటీ చెక్‌ ఉంటుందా? ఏది ఏమైనా నేను పని చేసిన ఇండస్ట్రీ అంటే నాకు గౌరవం. నన్ను నమ్మేవాళ్లు, నా పనిని గౌరవించేవాళ్లు కొంతమంది ఉన్నారు. వారు నన్ను గౌరవిస్తారు.. నమ్ముతారు’’ అని పలు ట్వీట్స్‌ లో రాసుకొచ్చారు రెసూల్‌ పూకుట్టి.సౌండ్ డిజైనర్ విభాగంలో ఆస్కార్ అవార్డు సాదించిన తర్వాత ఎవరూ తన ముఖం చూడటానికి, అవకాశాలు ఇవ్వడానికి ఇష్టపడకుండా మొహం చాటేయడం చూసి దాదాపుగా కుప్పగూలిపోయినంత పనయిందని రెసూల్ తెలిపారు. ఏఆర్ రెహమాన్ ఆరోపణలకు మద్దతుగా ట్వీట్ చేసిన సుప్రసిద్ధ నిర్మాత, దర్శకుడు, నటుడు శేఖర్ కపూర్‌ను ఉద్దేశించి రెసూల్ తన అనుభవం గురించి ట్వీట్ చేశారు

Related Posts