YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి దేశీయం

ఇక నో ఇంటర్

ఇక నో ఇంటర్

హైద్రాబాద్, జూలై 30, 
దేశవ్యాప్తంగా విద్యా విధానంలో సంచలన మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నూతన జాతీయ విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్పు చేసింది. ఉన్నత విద్యలో ప్రధాన సంస్కరణలను చేసింది. 2030 నాటికి అందరికీ విద్య అందించడమే లక్ష్యంగా ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై ఆర్ట్స్‌, సైన్స్‌ కోర్సుల విద్యా బోధనలో పెద్దగా తేడాలు ఉండవని వెల్లడించింది. బహుభాషల బోధన దిశగా నూతన విద్యా విధానం ఉండనున్నట్టు తెలిపింది.
దేశంలో విద్యా విధానంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. నూతన విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ బుధవారం (జులై 29) ఆమోదం తెలిపింది. విద్యార్థులపై కరికులమ్ భారం తగ్గించడమే నూతన విద్యా విధానం లక్ష్యమని కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. పలు కోర్సుల కాల పరిమితిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో 34 ఏళ్ల తర్వాత ప్రభుత్వం కొత్త విద్యా విధానం తీసుకొచ్చింది. పాఠశాల-కళాశాల వ్యవస్థలో పెద్ద మార్పులు చేసింది. డిప్లొమా కోర్సు కాల వ్యవధి రెండేళ్లుగా, వృత్తి విద్యా కోర్సుకు ఏడాదిగా నిర్ణయించింది.ఒక విద్యార్థి ఒక కోర్సు మధ్యలో మరొక కోర్సు తీసుకోవడానికి కొత్త విద్యా విధానంలో అవకాశం ఇచ్చారు. ఇందు కోసం ఆ విద్యార్థి మొదటి కోర్సు నుంచి పరిమిత సమయం వరకు విరామం తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.2030 నాటికి అందరికీ విద్య అందించాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు.
కీలక మార్పులివే..
✧ గతంలో ఉన్న 10+2 స్థానంలో నూతన విద్యా విధానంలోని 5+3+3+4ను అమలు చేయనున్నారు. మొదటి ఐదేళ్లను ఫౌండేషన్ కోర్సుగా, ఆ తర్వాత మూడేళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్ మరియు గ్రేడ్ 1, గ్రేడ్ 2గా పరిగణించనున్నారు.
✧ ఐదేళ్ల ఫౌండేషన్ కోర్సులో మొదటి మూడు సంవత్సరాలు 3 నుంచి 6 ఏళ్ల వయసు వారికి, తర్వాతి రెండేళ్లు 6 నుంచి 8 ఏళ్ల వయసు వారికి ఒకటి, రెండు తరగతుల విద్య అందించనున్నారు.
✧ 8 నుంచి 11 ఏళ్ల వయసు వారికి 3 నుంచి 5 తరగతులు, 11 నుంచి 14 ఏళ్ల వయసు వారికి 6 నుంచి 8 తరగతులు, 14 నుంచి 18 ఏళ్ల వయసు వారికి 9 నుంచి 12 తరగతులు నిర్వహించేందుకు కీలక నిర్ణయం.
✧ డిప్లొమా కోర్సు రెండేళ్లు, వృత్తి విద్య కోర్సు వ్వవధి ఏడాదిగా నిర్ణయం. వీటితో పాటు డిగ్రీ కోర్సు కాల వ్యవధి మూడు లేదా నాలుగేళ్లుగా మార్పు.
✧ ఇక మీదట బోర్డు పరీక్షలు ప్రాధాన్యం తగ్గిస్తూ, నైపుణ్యాల ఆధారంగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి.
✧ ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరిగేలా చూడాలి.
✧ రిపోర్టు కార్డులు ఇకపై మార్కుల ఆధారంగా కాకుండా నైపుణ్యాలు, సామర్థ్యాల నివేదికగా ఉండాలి. దీంతో పాటు ఆర్ట్స్, సైన్స్‌ మధ్య ఎలాంటి విభజన ఉండదని తెలిపారు.
✧ దేశంలో ఇకపై స్థానిక భాషల్లో ఇ-కోర్సులు. ఇందు కోసం నేషనల్‌ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరమ్‌ (ఎన్‌ఈటీఎఫ్) ఏర్పాటు చేసి వర్చువల్ ల్యాబ్స్‌.
✧ ప్రస్తుత విద్యా విధానంలో డీమ్డ్‌ యానివర్శిటీలకు, సెంట్రల్ యూనివర్శిటీలకు, స్వతంత్ర సంస్థలకు వేర్వేరు విధివిధానాలు ఉండగా.. వాటి స్థానంలో అన్నింటికీ ఒకే రకమైన విధివిధానాల అమలు.
✧ దేశంలో మొత్తం 45,000 అనబంధ కళాశాలలు ఉండగా, వాటికి గ్రేడెడ్ అటానమీ కింద అండర్ గ్రాడ్యుయేట్‌, అకడమిక్‌, అడ్మినిస్ట్రేటివ్‌, ఫైనాన్షియల్ అటానమీ కేటగిరీల కింద అక్రిడియేషన్ ఇవ్వనున్నారు.
దేశంలో మూడేళ్ల నుంచి 18 ఏళ్ల వరకు ప్రతి ఒక్కరికి విద్య తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. బహుభాషల బోధన దిశగా నూతన విద్యా విధానం ఉంటుందని వివరించింది. ఉన్నత విద్యలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని మంత్రి జవడేకర్‌ తెలిపారు. కొత్త విద్యా విధానం కోసం పెద్ద ఎత్తున సలహాలు తీసుకున్నామని ఆయన చెప్పారు. 2.5 లక్షల గ్రామ పంచాయతీలు, 6600 బ్లాక్‌లు, 676 జిల్లాలను సంప్రదించినట్లు వెల్లడించారు.
మూడు నుంచి 18 ఏళ్ల వరకు అందరికీ విద్య తప్పనిసరి
2030 నాటికి అందరికీ విద్య అందించడమే లక్ష్యం
ఆరు తరగతి నుంచి కోడింగ్, ప్రోగ్రామింగ్ కరిక్యులమ్
6వ తరగతి నుంచి వొకేషనల్ ఇంటిగ్రేషన్ కోర్సులు
ఇంటర్ విద్య ఉండదు
ఇంటిగ్రేటెడ్ పీజీ, యూజీ విద్య ఐదేళ్లు
దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యకు ఒకటే కరిక్యులమ్
పాఠ్యాంశాల భారం తగ్గించే కాన్సెప్ట్ నేర్పే ప్రయత్నం
ఇక నుంచి కస్తుర్బా గాంధీ బాలిక విద్యాలయ కేవలం 12వ తరగతి వరకు మాత్రమే
ఎంఫిల్‌ కోర్సును పూర్తిగా తొలిగించింది.
ప్రస్తుతం 10+2+3( టెన్త్, ఇంటర్, డిగ్రీ) విద్యా విధానం.. ఇక నుంచి 5+3+3+4 విద్యా విధానం
డిగ్రీ విద్య మూడు నుంచి నాలుగేళ్లు
పీజీ విద్య ఏడాది లేదా రెండేళ్లు
రీసెర్చ్ ఇంటెన్సివ్ లేదా టీచింగ్ ఇంటెన్సివ్ యూనివర్సిటీలు, అటానమస్ డిగ్రీ గ్రాంటింగ్ కాలేజీలు, మోడల్ మల్టీ డిస్సిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీలకు ఆమోదంబీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో దేశంలో నూతన విద్యా విధానం తీసుకురానున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే.

Related Posts