YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సైదిరెడ్డి అనుచరుల హల్ చల్

సైదిరెడ్డి అనుచరుల హల్ చల్

నల్గొండ, జూలై 30, 
హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన తన బంధువులు, సన్నిహితుల దందాలతోనే చెడ్డపేరు కొని తెచ్చుకుంటున్నారు. హుజూర్ నగర్ తెలంగాణ సరిహద్దు ప్రాంతం. కృష్ణా జిల్లా పరివాహక ప్రాంతంలో ఈ నియోజకవర్గం ఉంటుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఒకే ఒక ఉప ఎన్నికలో హుజూర్ నగర్ టీఆర్ఎస్ కైవసం అయింది. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా శానంపూడి సైదిరెడ్డి గెలుపొందారు.
2018 ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఆయన పార్లమెంటుకు ఎన్నిక కావడంతో హుజూర్ నగర్ కు జరిగిన ఉప ఎన్నికలో తన భార్య పద్మావతిని పోటీకి దింపారు. కానీ శానంపూడి సైదిరెడ్డి టీఆర్ఎస్ నుంచి గెలిచారు. తొలిసారి గెలిచిన సైదిరెడ్డి ఏడాది కాలంలోనే అనేక వివాదాలను ఎదుర్కొంటున్నారుశానంపూడి సైదిరెడ్డికి నేరుగా ఆరోపణలతో సంబంధం లేకపోయినా ఆయన పేరు బాగా విన్సిస్తుంది. సరిహద్దు నియోజకవర్గం కావడంతో అక్రమ మద్యం, ఇసుక రవాణా, గుట్కా, అటవీ భూముల ఆక్రమణ వంటి విమర్శలు ఎమ్మెల్యే సైదిరెడ్డి పై ఎక్కువగా విన్పిస్తున్నాయి. సైదిరెడ్డి అనుచరులు, బంధువులు ఈ దందాకు కారణమన్న ఆరోపణలున్నాయి. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఏడు మండలాలున్నాయి. మఠంపల్లి, మేళ్ల చెరువు, పాలకవీడు, చింతలపాలెం మండలాలు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ జరిగే దందాకు మేళ్ల చెరువుకు చెందిన ఒకరు సూత్రధారిగా ఉన్నారు. ఆయనకు నెలకు పది లక్షల కప్పాన్ని దందా చేసే వారు కడుతున్నారు. ఈ వ్యక్తి ఎమ్మెల్యే సైదిరెడ్డికి దగ్గర వ్యక్తి కావడంతో ఆరోపణల వెనక ఎమ్మెల్యే కూడా ఉన్నారంటున్నారు.ఇక పాలకవీడు, చింతలపాలెం, రఘునాధపాలెం మండలాల్లో అటవీ భూములు ఎక్కువగా ఉన్నాయి. అటవీ శాఖ భూములను కొందరు దర్జాగా ఆక్రమిస్తున్నారు. అయినా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటున్నారు. దీంతో ఇటీవల హుజూర్ నగర్ లో జరుగుతున్న దందాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సొంత నియోజకవర్గం కావడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డికి అక్కడ జరిగే ప్రతి విష‍యం ఎప్పటికప్పడు తెలుస్తుండం, సైదిరెడ్డిని టార్గెట్ చేస్తుండటంతో ఎమ్మెల్యే ఇబ్బందుల్లో పడ్డారు. పార్టీ అధిష్టానానికి కూడా సైదిరెడ్డిపై సొంత పార్టీ నేతలు ఫిర్యాదు చేశారంటున్నారు.

Related Posts