YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*పవిత్రోపాన ఏకాదశి*

*పవిత్రోపాన ఏకాదశి*

పవిత్రోపాన ఏకాదశి లేదా పుత్రదా ఏకాదశి.
శ్రావణ మాసములో వచ్చే విశిష్టమైన తిథి శ్రావణ శుక్ల ఏకాదశి.
పరమపావనమైన ఈ రోజున ఇంటిలో లక్ష్మినారాయణులను భక్తితో పూజించి, పాలను నైవేద్యంగా ఉంచి, విష్ణు సహస్రనామములను, విష్ణు అష్టోత్తరములను పారాయన చేసి, పాలు, పండ్ల వంటి సాత్వికాహారం తీసుకొని ఉపవాసం ఉండాలి. దగ్గర్లోని వైష్ణ్వవాలయాన్ని సందర్శించి మరియు ఈ రోజున నిత్య పూజ, ఉపవాసాది కార్యక్రమములను చేయడం ద్వారా విశేషమైన సిరిసంపదలు కలుగుతాయి, సమస్త పాపముల నుండి విడివడి వైకుంఠ ప్రాప్తిని పొందుతారు.
ఈ ఏకాదశిని విష్ణుప్రీతిగా భక్తి, శ్రద్ధలతో చేయడం అశ్వమేధ యాగం చేసిన ఫలితం పొందుతారు మరియు సత్పుత్రుడిని సంతానంగా పొందగలరని శ్రీకృష్ణపరమాత్మ ధర్మరాజుకి బోధించారు ---   
బ్రహ్మ వైవత్తర పురాణం. 
*చేయవలసినవి:-*
- దగ్గరలోనున్న వైష్ణవ ఆలయాన్ని సందర్శిస్తే విశేషంగా విష్ణు భగవానుడి అనుగ్రహం పొందుతారు.
- రోజంతా కృష్ణ, మాధవ, గోవింద అని హరినామాన్ని జపించండి.
- మద్యపానం , మాంసాహారం వంటి పాపకర్మలకు దూరంగా ఉండండి.
ఏకాదశి రోజున ధాన్యంతో(బియ్యం, గోధుమ, బార్లే వంటివి) చేసిన ఆహారం నిషిద్ధము కావున  పాలు, పండ్లు వంటి సాత్వికమైన ఆహారం స్వీకరించవచ్చు.
-శక్తి కొలది దాన, ధర్మాదులు, జప, తపాదులు చేయడం మంచి ఫలితాన్నిస్తుంది.
*హరినామ స్మరణం* -
*సమస్త పాపహరణం*

Related Posts