YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మనస్సు మర్మం

మనస్సు మర్మం

నీవెవరవో తెలుసుకో.. నీవే ప్రపంచం
అందరూ మనసు మనసు అంటారు ..
అసలు మనసు అంటే ఏమిటో ...
వాయు వేగంగా పరుగులు తీస్తూ...
లేనిది కోరుతూ ఉన్నది వదిలేస్తూ ...
గతాలను తవ్వేస్తూ భవిష్యత్తును భయ పెట్టేస్తూ ..
కాలాన్ని వృధా చేస్తున్న ఎవరు ఈ మనసు
ఏమిటి ఈ మనసు అంటే అర్ధం ????
''ఆ'' అంటే ఎక్కడో సుదూరంగా ....................
''లోచనం అంటే కన్ను"
ఆలోచన అనే పదంలోనే 'ఆ' అంటే ఎక్కడో దూరంగా మనకన్నా భిన్నంగా గాని మనకన్నా వేరుగా ఉన్నదాన్ని సూచిస్తుంది. ఆలోచనంలో ఉన్న 'లోచనం' అంటే కన్ను అని అర్థం.
అంటే దీన్నిబట్టి చూస్తే ''మన మనసే ఒక కన్ను అనవచ్చు''.
ఈ మనసు అనే కన్ను ఎంత సేపటికి బయటకే పరుగెడుతుంది .
కాబట్టి దీన్ని ఆలోచనం అంటున్నాం. అంటే బాహ్యంగా ఉన్న విషయాన్ని
''మనలోనే ఉన్న మనసుతోనే చూస్తున్నాం. '' మనసు, ఆలోచన, అంతరంగం, అంతరాత్మ- పేర్లు ఏవైనా ఇవన్నీ మనసుతో ముడిపడి ఉన్నవే.
''నీవెవరో తెలుసుకో' అని బోధించిన రమణ మహర్షుల వారైనా 'నీవే ప్రపంచం' అన్న జిడ్డు కృష్ణమూర్తి తత్వమైనా నీలో ఉన్న ప్రపంచాన్ని నిన్నే చూడమంటోంది.
అరిషడ్వర్గాలను సన్యసించి ''మనసు బుద్ది వాక్కు ''ను ఏకం చేసి, పరుగులు తీసే మనసును నిలువరించి '' , '' భాహ్యంగా ఎక్కడి నుండి ఎక్కడికో పరుగులు తీస్తున్న ఈ ''లోచనంను'' అభ్యాసం ద్వారా ( బాహ్య ప్రయాణం నుండి అంతః ప్రయాణం చెస్తూ ) అంతర్ముఖం గావించిన వారు మాత్రమే సాధకుడు ''
ఇక, నేను ధ్యానిని ......
నేను యోగిని .....
నేను సాధకుడను ......
నేను సన్యాసిని ............
నేను గురువును .....
నేను ... నేను ......
ఇలా ఎవరి మనసుకు వారు నేను '' నేను '' నేనే '' అని చెప్పుకునే వారు '' ముందు ఎవరికీ వారు మన ''మనసును జయించామా ?అరిషడ్వర్గాలను అదుపులో ఉంచామా?" ( కామ ,క్రోధ , లోభ, మోహ , మధ మాత్సర్యాలను పూర్తిగా సన్యసించామా ) అని '' మన గురువును అడిగేస్తే మనకు సత్యం చెప్పేస్తాడు '' అదేనండి మన గురువు మన మనస్సే .. మనం యోగులమా , భోగులమా అని మనల్ని మనకు అద్దంలో చూపిస్తుంది .
'' ఈ మనసును జయించనంత కాలం నువ్వు సాధకుడవు కాదు ..'' భోదకుడవు మాత్రమే "
సాధన చేద్దాం సాధ్యం కానిది ఏముంది....
 

Related Posts