వరంగల్ అర్బన్ జూలై 30
ఆడపిల్ల పుట్టిందని భార్యను ఇంట్లో నుండి భర్త వెల్లగొట్టాడు. దాంతో ఆమె న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఆమెకు .మహిళ సంఘాలు మద్దతుగా నిలిచాయి. నునానవత్ నిర్మల, బాలరాజులకు రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. నిర్మల..సిద్ధాపురం గ్రామ నివాసి. బాలరాజు ప్రస్తుతం హన్మకొండ..అశోక కాలనీ లో ఉంటున్నారు. బాలరాజు సొంతూరు చిన్నపెండ్యాల్. తమకు ఆడపిల్ల పుట్టిందని బాలరాజు తనను ఇంటినుంచి పంపివేసాడని నిర్మల ఆరోపణ. మహిళా సంఘాలకు కుడా నిర్మలకు మద్దతుగా అందోళనకు దిగాయి. విషయం తెలుసుకొని సుభేదారి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇరు కుటుంబాలను స్టేషన్ కు తరలించారు