విజయవాడ జూలై 30
కరోనా పరీక్షలు నిర్వహించే స్థానంలో కృష్ణా జిల్లా ఏపీలోనే నెంబర్ వన్గా ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ 2 లక్షల 10 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని.. 6 వేల పాజిటివ్ కేసులు జిల్లాలో నమోదయ్యా యని చెప్పారు.ఆస్పత్రులలో బెడ్ల సామర్థ్యాన్ని పెంచామన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో కరోనాకు ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందిస్తు న్నామని మంత్రి వెల్లడించారు. డబ్బుకు వెనుకాడకుండా వైద్యం అందించాలన్నే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.ఏపీలో కరోనాతో ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు ఏ ఒక్కరికైనా భరోసా ఇచ్చారా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు ఇష్యూ పై హడావుడి చేసి వెళ్లిపోయారని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు కరోనా విపత్తులో పత్తాలేకుండా పోయారని మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ను కూడా రాజకీయం చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వ విధి విధానాలను జిల్లా యంత్రాంగం పాటిస్తుందని తెలిపారు. జిల్లాలో కేసులు తగ్గడానికి ముందస్తుగా తీసుకున్న చర్యలే కారణమని పేర్కొన్నారు. హోం క్వారంటైన్ వైద్యానికి పెద్ద పీట వేస్తున్నారని...ఎవరూ భయపడాల్సిన పని లేదని చెప్పారు. ప్రభుత్వ పరంగా అన్ని వైద్య సేవలందిస్తున్నామన్నారు.