YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కరోనా కాలంలో నకిలి డాక్టర్ల చేతివాటం

కరోనా కాలంలో నకిలి డాక్టర్ల చేతివాటం

విజయవాడ జూలై 30 
కరోనా వైరస్ మహమ్మారి ప్రజలని ఆందోళనకి గురిచేస్తుంటే ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా కొందరు తమ చేతివాటం చూపిస్తున్నారు.   వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అందరికీ అవసరమైన మాస్క్లు శానిటైజర్ మొదలు..పీపీఈ కిట్ల వరకు ప్రతిదాంట్లోనూ మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే కరోనా కాలంలో పలుచోట్ల నకిలీ డాక్టర్లు కూడా తమ చేతివాటం చూపిస్తున్నారు. తాజాగా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి లో ఓ నకిలీ డాక్టర్ గుట్టు బయటపడింది. మాములుగా కరోనా సోకినా రోగుల వద్ద కి వైద్యులు కూడా పీపీఈ కిట్ ధరించి వెళ్లి వైద్యం చేస్తుంటారు. కానీ ఓ 45 ఏళ్ల మహిళ డాక్టర్ అవతారం ఎత్తి నాలుగు రోజులుగా ఐసీయూల్లో ఉన్న రోగుల వద్దకు వెళ్లి వస్తుంది. అదేరీతిలో బుధవారం కూడా మెడలో స్టెత్ వేసుకుని సూపర్స్పెషాలిటీ బ్లాక్ లోని గ్రౌండ్ ఫ్లోర్ కు వచ్చింది. అక్కడే తచ్చాడుతూ తిరుగుతుండటంతో అనుమానం వ్యక్తం చేసిన సిబ్బంది ఆమెని ప్రశ్నించగా .. డాక్టర్ శైలజ అంటూ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే ఆమె చెప్పే సమాధానాలపై అనుమానం వ్యక్తం చేసిన సిబ్బంది ఆమెని ఓ రూమ్ లో బంధించి ఐడి కార్డు చూపించమనగా పొంతనలేని సమాధానం చెప్పింది. దీనితో రూమ్ లో బంధించి పోలీసులకి అప్పగించారు.
పోలీసులు తమ స్టైల్ లో ఆమెని విచారించగా ..  పీపీఈ కిట్ ధరించి రోగుల బంధువుల నుంచి సదరు మహిళ నకిలీ డాక్టర్ డబ్బులు వసూలు చేసింది. కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితి చెబుతానంటూ డబ్బు వసూలు చేస్తూ క్యాష్ చేసుకుంటుంది. ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. మహిళపై గతంలో అనేక కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.ఆమె పోస్టు గ్రాడ్యుయేషన్ చదివినట్లు తెలిసింది. అయితే ఆమె గత నాలుగు రోజులుగా కరోనా రోజులు ఉన్న హాస్పిటల్ లో కలియ తిరగడంతో ఆమెకి కరోనా సోకిఉండే అవకాశం ఉండటంతో ఆమెని విచారించిన పోలీసులు ఇప్పుడు భయపడుతున్నారు.

Related Posts