హైదరాబాద్ జూలై 30
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటారు. కరోనా లాక్ డౌన్ తో వైరస్ అంటుందని అందరూ భయంతో చస్తుంటే శృంగార పురుషులు మాత్రం రాసలీలలు ఆపడం లేదు. హైటెక్ వ్యభిచారం ముఠా వీరిని క్యాష్ చేసుకుంటోంది. తాజాగా హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం ముఠాను రాచకొండ పోలీసులు రట్టు చేశారు. చిలకలూరిపేటకు చెందిన వంశీరెడ్డి విజయవాడకు చెందిన ఓ మహిళ చిన్నా అనే మరో వ్యక్తి కలిసి ముఠాగా ఏర్పడ్డారు. అమ్మాయిలను సప్లై చేసే ముఠాతో టై అప్ అయ్యి ఏకంగా కోల్ కతా నుంచి నలుగురు.. విజయవాడ నుంచి మరో అమ్మాయిని తీసుకొచ్చి హైటెక్ వ్యభిచారం స్ట్రాట్ చేశారు.ఓ యాప్ ను క్రియేట్ చేసి వీరి ఫోటోలను పెట్టి ఆన్ లైన్ లో వ్యభిచారం దందా షురూ చేశారు. ఇక ఫోన్ చేశాక ట్రూకాలర్ లో చూస్తూ వెరిఫై చేసుకున్నాకే యువతులను డోర్ డెలివరీ చేస్తూ నడిపిస్తున్నారు.తాజాగా పోలీసులకు ఈ ప్రైవట్ సిమ్ కార్డ్ తో వీరిని సంప్రదించి డబ్బులను ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేయగా.. అమ్మాయిలు ఆటోలో వచ్చేశారు. దీంతో పోలీసులు వీరి ముఠా అడ్రస్ కనిపెట్టి నలుగురు అమ్మాయిలతోపాటు నిర్వాహకుడు వంశీరెడ్డిని అరెస్ట్ చేశారు. మరో మహిళ చిన్నా పరారయ్యాడు. ఇలా హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు అయ్యింది.