ప్రకాశం జిల్లా
పుల్లలచెరువు మండంలో
కోవిడ్ 19 పట్టణాలను దాటి పల్లెలకు పాకుతున్న ఆపత్కాల పరిస్థితి నేపధ్యంలో అధికారులు నివారణకు చర్యలు చేపట్టారు.
పంచాయతీ సెక్రెటరీ పూర్ణచందు మాట్లాడుతూ జనం సమూహాలుగా ఉండేందుకు వీల్లేకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంటింటికి మాస్కులు పంపిణీ చేసి, మాస్కు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా మాత్రమే కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత గురించి ఆరోగ్య కార్యకర్తల ద్వారా విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రధానంగా పంచాయతీల్లో కార్యదర్సులు ఈ విషయాల్లో ప్రధానభూమిక పోషిస్తున్నారు. ముటుకుల, ఐటీవరం, మల్లపాలెం, గ్రామాల్లో పారిశుధ్యపనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బ్లీచింగ్ పొడి చల్లించడం, అన్ని వీధులను పరిశుభ్రంగా ఉంచడం, మురుగు కాలువల్లో పూడికతీత, వ్యర్ధాలను ఊరికి దూరంగా పడేయడం, నీరు ప్రవహించేలా కల్వర్టుల ఏర్పాటు, సోడియం హైపోక్లోరేట్ పిచికారీ చేయించడం వంటి పనులు ,కార్యదర్శి పూర్ణచందు ,ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అధికారులఆదేశాలతో కరోనా వ్యాప్తి నివారణా చర్యలు చేపట్టామని కార్యదర్శి పూర్ణచంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో "వాల్ ఎంట్రీలు" సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.