YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ ప్రభుత్వ తీరుపై ఎంపీ రఘురామకృష్ణంరాజు సెటైర్లు

జగన్ ప్రభుత్వ తీరుపై ఎంపీ రఘురామకృష్ణంరాజు సెటైర్లు

న్యూఢిల్లీ జూలై 30 
జగన్ ప్రభుత్వ తీరుపై ఎంపీ రఘురామకృష్ణంరాజు సెటైర్లు వేశారు. గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘రాష్ట్ర ప్రభుత్వం తెలుగు మీడియంను పూర్తిగా తీసేసి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామన్నప్పుడు.. దానికి ప్రజలంతా బీభత్సమైన మద్దతు ఇచ్చినప్పుడు నువ్వెందుకు దాన్ని వ్యతిరేకించావు.. వ్యతిరేకిస్తున్నావా అని మేము అడిగినా..వ్యతిరేకించలేదని చెప్పలేదు కాబట్టి నిన్నెందుకు డిస్‌క్వాలిఫై చేయకూడదని’’ పార్టీ ప్రశ్నిస్తూ నోటీస్ ఇచ్చిందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది చూసి ప్రభావితం అవ్వకుండా ఒక మంచి విద్యా విధానాన్ని మాతృభాషలోనే 5వ తరగతి వరకు విద్యా బోధన తప్పనిసరిని కేంద్రం నిర్ణయించిందన్నారు. ఇదొక విధంగా అన్యోపదేశంగా సీఎం జగన్ వలనే జరిగిందని చెప్పవచ్చని రఘురామ అన్నారు. సరైన సమయానికి సరైన న్యాయం జరిగిందన్నారు. దేశంలో మాతృభాషకు ఇంత ప్రాధాన్యత రావడానికి జగన్ దోహదపడ్డారన్నారు. దేశస్థాయిలో మాతృ భాషకు ఇంత గుర్తింపు తెచ్చిన సీఎం జగన్‌ను అభినందిస్తున్నానని అన్నారు.ప్రపంచంలో ఎక్కవగా మాట్లాడే భాష మాండరిన్ అని.. చైనా దేశంలో 140 కోట్లు ఉన్న చైనా జనాభాలో 90 కోట్ల మంది మాండరిన్ మాట్లాడతారని రాఘురామ అన్నారు. ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడేది స్పానిష్ భాష అన్నారు. సుమారు 20 దేశాల్లో మాతృభాష స్పానిష్ అని తెలిపారు. ప్రపంచ జనాభాలో 4.85 శాతం మంది స్పానిష్ మాట్లాడతారన్నారు. ఆ తర్వాత ఇంగ్లీష్, హిందీ అని చెప్పారు. ఏ దేశమైన ఎక్కడైనా ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే ఉండాలని చెబుతాయన్నారు. పరిపూర్ణ మానసిక వికాసం ఉండాలంటే ముందు మాతృ భాషే అవసరమని,  ఒక అవగాహన వచ్చిన తర్వాత ఏ భాష నేర్చుకోవాలన్నా చాలా సులభమవుతుందని రాఘురామ వ్యాఖ్యానించారు. ప్రాథమిక స్థాయిలో విద్యా విధానం మాతృభాషలో ఉండడం చాలా అవసరమన్నారు. దీనిపై ఎవరైనా  మాట్లాడితే మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని ఎదురు పశ్నించారని, ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదని రఘురామ అన్నారు.

Related Posts