రాజమండ్రి జూలై 30
గోదావరి జిల్లాలో రైలే , పట్టాల పైనే వెళ్తుంది కానీ పూర్తిస్థాయి రైలు కాదు , బస్సు లాగా ప్రయాణించే బుల్లి రైలు ..దీన్ని "రైలు బస్సు" అని అంటారు ఇది ఆంధ్ర ప్రదేశ్ లో కాకినాడ నుంచి కోటిపల్లి వరకు నడిచే ఏకైక "రైలు బస్సు" ఈ రైలు బస్సుని 2004 లో ప్రారంభించారు. కాకినాడ లో ఉదయం 9:30 బయలుదేరి కొవ్వాడ,అర్తలకట్ట,కరప ,వాకాడ ,వేలంగి ,నరసాపురపుపేట ,రామచంద్రాపురం ,ద్రాక్షారామం ,కుండూరు ,గంగవరం మీదుగా కోటిపల్లి 11:00 గంటలకు చేరుకుంటుంది...చుట్టూ పచ్చటి పొలాల మధ్య ఈ బుల్లి"రైలు బస్సు"లో ప్రయాణం అబ్బబ్బా ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము.