YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మడ ఏర్పాటుకు ముహర్తం...

మడ ఏర్పాటుకు ముహర్తం...

కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు మాస్టర్ ప్లాన్ ఏర్పాటుపై మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మడ స్పెషలాఫీసర్ విల్సన్ బాబు పాల్గొన్నారు. పోర్టు ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులు మంత్రి, ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. బాపట్ల – మచిలీపట్నం – కోటిపల్లి రైల్వే లైన్ అవసరమని అధికారులు తెలిపారు. భావితరాలకు మార్గదర్శకంగా ఉండే విధంగా మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంటీ అధారిటీ  మాష్టర్ ప్లాన్‌ను తయారు చేయనున్నట్లు ముడ వైస్ చైర్మన్ విల్సన్ బాబు తెలిపారు. ముడ మాస్టర్ ప్లాన్ తయారీపై బందరు ప్రాంతంపై పూర్తి స్థాయి అవగాహన కలిగిన ప్రముఖుల నుండి అభిప్రాయాలను సైతం పరిగణలోకి తీసుకుని మాస్టర్‌ప్లాన్ తయారు చేస్తామన్నారు. మాస్టర్‌ప్లాన్ తయారీపై  సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.155 దేశాల్లో ఆయా ప్రాంతాల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ తయారు చేసిన అంతర్జాతీయ సంస్థ అస్కానిక్ డిహెచ్‌వి కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ముడ మాస్టర్‌ప్లాన్ తయారీ బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. ముడకు అనుబంధంగా ఈ సంస్థ పని చేస్తుందని వివరించారు. ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ముఖ్య ప్రముఖుల నుండి వచ్చే అభిప్రాయాలను సేకరించి జోనల్ ప్లాన్, ఏరియా డెవలప్‌మెంట్ ప్లాన్, ఫర్ఫెక్టివ్ ప్లాన్ తయారు చేస్తారన్నారు. అన్ని ప్రాంతాలను సమ దృష్టితో ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. మడ ప్రాంతాన్ని రానున్న 35 సంవత్సరాలకు సంబంధించిన అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అస్కానిక్ డీహెచ్‌వి కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు గ్రామీణ ప్రాంతాల్లో, మున్సిపల్ పరిధిలో సమావేశాలు నిర్వహించి సమస్యలను, రోడ్ల స్థితిగతులను, పురాతన కట్టడాలను గుర్తించి వాటిపై సలహాలు, సూచనలు ముడకు అందిస్తారన్నారు.

Related Posts