YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

త్యాగయ్యలకు కోపం వస్తోంది

త్యాగయ్యలకు కోపం వస్తోంది

త్యాగయ్యలకు కోపం వస్తోంది
కాకినాడ, 
అధికార వైఎస్సార్ సీపీలో అసంతృప్తి సెగ‌లు భ‌గ్గుమంటున్నాయి. నిన్నమొన్నటి వ‌ర‌కు సైలెంట్‌గా ఉన్న నాయ‌కులు, సీనియ‌ర్లు.. ఇక ఓపిక న‌శించ‌డంతో త‌మదైన శైలిలో అధినేత జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావ‌డం వెనుక పార్టీ అధినేత జ‌గ‌న్ కృషి ఎంత ఉందో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో సీనియ‌ర్ల త్యాగాలు కూడా అంతే ఉన్నాయ‌నేది వాస్తవం. కొంద‌రు సీట్లు కూడా త్యాగం చేసి, జ‌గ‌న్ గెలుపు కోసం.. ఆయ‌న మాట కోసం.. పార్టీ అభివృద్ధికి క‌ట్టుబ‌డ్డారు. పార్టీ అధికారంలోకి వ‌స్తే.. మా వోడే సీఎం అయ్యాడ‌ని సంతోషించారు.కానీ, ఆ సంతోషం మాటున‌.. జ‌గ‌న్ సీఎం అయిన ఘ‌ట‌న వెనుక ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి. అయితే, ఇలా త్యాగాలు చేసిన వారికి ఇప్పటి వ‌ర‌కు ల‌భించిన ఛాన్స్‌లు ఎన్ని? జ‌గ‌న్ ప‌ట్టించుకుని.. ప‌ద‌వులు ఇచ్చింది ఎంతమందికి ? అని లెక్కచూసుకుంటే.. గ‌తంలో చంద్రబాబు మాదిరిగానే జ‌గ‌న్ కూడా ముందొచ్చిన చెవుల కంటే.. వెనుకొచ్చిన కొమ్ముల‌నే పూజిస్తున్నారు. వారికే అంద‌లాలు క‌ట్టబెడుతున్నారు. ఇది సీనియ‌ర్లను, ముఖ్యంగా త్యాగాలు చేసిన వారినీ తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పుడు కాక‌పోతే.. మ‌రోనాడు త‌మ‌ను ప‌ట్టించుకుంటాడ‌న్న వారి ఆశ‌లు నీరుగారుతున్నాయి.దీంతో చాలా మంది నాయ‌కులు ప‌రోక్షంగా పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. వీరిలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల‌కు ముందు వారి అవ‌కాశాల కోసం.. వారి అవ‌స‌రాల కోసం .. పార్టీ మారిన వారిని జ‌గ‌న్ త‌న‌ భుజాలపై మోస్తున్నారు త‌ప్ప.. వైఎస్సార్ సీపీ ర‌థానికి చ‌క్రాలుగా మారిన వారిని.. నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన నాయ‌క‌త్వాన్ని ఏర్పాటు చేసిన వారిని ఆయ‌న విస్మరిస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ కోసం ఏడెనిమిదేళ్ల పాటు క‌ష్టప‌డి ఆర్థికంగా ఎన్నో క‌ష్టన‌ష్టాల‌కు ఓర్చిన వారిని ప‌క్కన పెట్టి ఆర్థిక కార‌ణాలు, ఇత‌ర‌త్రా కారాణ‌ల‌తో జ‌గ‌న్ ఎలాంటి రాజ‌కీయ అనుభ‌వం, ప్రజ‌ల్లో ప‌లుకుబ‌డి లేని వాళ్లకు సీట్లు ఇచ్చినా వారంతా జ‌గ‌న్ గాలిలో గెలిచారు. ఇక గెలిచిన ఎమ్మెల్యేల్లోనూ జ‌గ‌న్ సీనియ‌ర్లను ప‌క్కన పెట్టి.. జూనియ‌ర్లకు మంత్రి ప‌ద‌వుల‌తో పాటు కీల‌క ప‌ద‌వులు ఇవ్వడం కూడా చాలా మంది నేత‌లు జీర్ణించు కోలేక‌పోతున్నారు.మ‌రి కొంద‌రికి ఇప్పటి వ‌ర‌కు అపాయింట్ మెంట్లు ఇవ్వక‌పోవ‌డం ఒక మైన‌స్ అయితే.. ఇచ్చిన వారికి కూడా రూపాయి నిధులు విద‌ల్చక‌పోవ‌డం ఎమ్మెల్యేల గోడు అటు జ‌గ‌న్‌, ఇటు మంత్రులు కూడా ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతోనే వైఎస్సార్‌సీపీలో ఇప్పుడు జ‌గ‌న్‌పై అసంతృప్తి స్వరాలు ఎక్కువ అవుతున్నాయి. నిన్నమొన్నటి వ‌ర‌కు కూడా వైఎస్సార్ సీపీపైనా… జ‌గ‌న్‌పైనా సానుభూతి ఉన్న సాధార‌ణ ప్రజ‌లు కూడా `ఇదేంటి ఇలా చేస్తున్నారు?` అనే చ‌ర్చించుకునే స్థాయికి ప‌రిస్థితి దిగ‌జారింది. దీనిని బ‌ట్టి ఇప్పటికైనా జ‌గ‌న్ త‌న నిర్ణయాల‌పై స‌మీక్ష చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌నేది ప‌రిశీల‌కుల మాట‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి

Related Posts