YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

చిన్నమ్మ కోసం ఎదురు చూపులు

చిన్నమ్మ కోసం ఎదురు చూపులు

చిన్నమ్మ కోసం ఎదురు చూపులు
చెన్నై, 
తమిళనాడు రాజకీయాలు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ హీటెక్కుతున్నాయి. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలు ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రచించుకుంటున్నాయి. డీఎంకే తన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకుంది. మరో వైపు కూటమి పార్టీలను కూడా పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది. కమల్ హాసన్ కు చెందిన మక్కల్ నీది మయ్యమ్ ను కూడా దగ్గరకు తీసుకోవాలని డీఎంకే భావిస్తుంది.అయితే అన్నాడీఎంకేలో నాయకత్వ సమస్య ఉంది. ప్రజలను ఆకట్టుకునే నేత లేరు. తమిళనాడులో బలపడాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. కానీ సంస్థాగతంగా బలంగా ఉన్న డీఎంకే, అన్నా డీఎంకేలను కాదని కనీస సీట్లను సాధించే అవకాశం లేదు. ప్రస్తుతం బీజేపీ అన్నాడీఎంకేతో సఖ్యతగా ఉంది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా అన్నాడీఎంకేతో కలసి పోటీ చేసినా ఒక్క సీటు కూడా బీజేపీకి దక్కలేదు.డీఎంకే కాంగ్రెస్ పార్టీతో సఖ్యతగా ఉంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ను బలోపేతం చేసే బాధ్యతను బీజేపీ భుజానకెత్తుకుంది. ఇందులో భాగంగానే శశికళ ను తిరిగి తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలం చేయాలని భావిస్తోంది. శశికళ జైలు నుంచి బయటకు రాగానే అన్నాడీఎంకే పగ్గాలు చేపడతారని తమళనాడులో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పళనిస్వామి, పన్నీర్ సెల్వంలను కూడా ఒప్పించి శశికళకు పార్టీ పగ్గాలు అందిస్తారంటున్నారు.శశికళ మాత్రమే జయలలితకు రాజకీయ వారసురాలని బీజేపీ భావించడమే ఇందుకు కారణం. అన్నాడీఎంకేలోని అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా శశికళ రాకను స్వాగతిస్తున్నారు. ఈ మేరకు శశికళ మేనల్లుడు దినకరన్ తో కొందరు టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. మొత్తం మీద చిన్నమ్మ రాకతో తిరిగి అన్నాడీఎంకేను అధికారంలోకి తీసుకురావాలన్నది బీజేపీ వ్యూహంగా ఉంది. పార్టీ పగ్గాలు దక్కినా విజయాన్ని అందించడంలో శశికళ సక్సెస్ అవుతారో? లేదో? చూడాలి.

Related Posts